IAF MiG 29K Fighter Jet Crash: భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కే విమానం గోవా తీరంలో కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగానే మిగ్- 29కే విమానం కూలిపోయినట్లు నేవీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో పైలట్ క్షేమంగా బయటపడ్డాడు.






తిరిగి వెళ్తుండగా


విమానం సముద్రం మీదుగా ఎగురుతుండగా సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కూలిపోయింది. సమాచారం అందిన వెంటనే అధికారులు వేగంగా రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. దీంతో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.


శిక్షణలో వినియోగిస్తున్న ఈ విమానం నేవీ స్థావరానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై విచారణకు బోర్డు ఆఫ్ ఎంక్వైరీని అధికారులు ఆదేశించారు. రష్యాలో తయారైన మిగ్‌-29కే ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన యుద్ధ విమానం.


ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎజెక్షన్‌ హ్యాండిల్‌ లాగడంతో వెనక సీటులో ఉండే పైలట్‌ ముందుకు ఎజెక్ట్‌ అయి సురక్షితంగా బయటపడేందుకు ఈ విమానంలో ప్రత్యేక ఎజెక్షన్ సీటు ఉంది. 2020 ఫిబ్రవరి, నవంబర్‌ నెలల్లో రెండు మిగ్‌-29 కే విమానాలు కూలిపోయాయి.


ఇటీవల


భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లో ఇటీవల కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు. తవాంగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.






గాయపడ్డ ఇద్దరు పైలట్లను సమీపంలోని సైనిక ఆస్పత్రికి తరలించారు. అందులో లెఫ్టినెంట్ కర్నల్​ సౌరభ్​ యాదవ్​ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో పైలట్​ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. 


Also Read: Viral Video: పానీపూరీ ఎలా ఉంది గజేంద్ర! ఎంచక్కా లాగించేసింది!


Also Read: Congress President Election: 'నా వెనుక సోనియా గాంధీ లేరు- అందుకే బరిలోకి దిగాను'