Viral Video: సాధారణంగా ఏనుగులకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంటాయి. ఏనుగులు గుంపులు గుంపులు అడవుల్లో నుంచి వచ్చి చెరుకు పంటలపై దాడి చేసి తినేసిన ఘటనలు మనం చూసే ఉంటాం. అయితే ఓ ఏనుగు మాత్రం ఎంచక్కా పానీపూరీలు లాగించేసిన వీడియో మీరు చూశారా?
ఎంతో హాయిగా
పానీపూరీని ఒక ఏనుగు ఎంతో ఇష్టంగా లాగించేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసోం గువాహటిలో ఈ ఘటన జరిగింది. ఏనుగు.. మార్కెట్‌లో ఉన్న పానీ పూరీ బండి వద్దకు వచ్చి మరీ పానీపూరీలను ఇష్టంగా తింటోంది. పానీపూరీ బండివాడు సర్వ్ చేస్తుంటే చక్కగా ఒక్కొక్కటి నోట్లో వేసుకుని ఏనుగు ఎంజాయ్ చేస్తోంది.
మరో వీడియో
సాధారణంగా వీవీఐపీలు, ప్రముఖ రాజకీయ నేతలు, సెలబ్రెటీలకు Z+++ కేటగిరీ భద్రత కల్పిస్తారు. అయితే ఓ పిల్ల ఏనుగుకు ఇలాంటి భద్రత కల్పించడం ఎప్పుడైనా చూశారా? అవును ఈ భద్రత చూస్తే మీరు కూడా అవాక్కవ్వక తప్పదు.
కంటికి రెప్పలా
కోయంబత్తూర్‌లోని సత్యమంగళం ప్రాంతంలో ఓ ఏనుగుల గుంపు రోడ్డుపై నడిచి వస్తుంది. అయితే ఆ ఏనుగుల కాళ్ల మధ్యలో ఓ పిల్ల ఏనుగు నడుస్తోంది. అది బయటకు వచ్చిన ప్రతిసారీ ఆ ఏనుగుల గుంపు అది కనిపించకుండా భద్రంగా ముందుకు తీసుకువెళ్తున్నాయి.
ఈ ఆసక్తికర ఘటనను ఎవరో వీడియో తీశారు. ఈ వీడియోను సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
" ఈ భూమ్మీద ఎవరూ కూడా అంత భద్రత కల్పించలేరు. అది కేవలం ఏనుగుల గుంపునకే సాధ్యమైంది. అప్పుడే పుట్టిన పిల్ల ఏనుగుకు మిగతా ఏనుగులు జడ్ ప్లస్ ప్లస్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాయి. "
- సుశాంత నంద, ఐఎఫ్ఎస్ ఆఫీసర్
వీడియో వైరల్
ఈ వీడియో వైరల్ అవుతోంది. పిల్ల ఏనుగును అంత భద్రంగా తీసుకువెళ్తున్న గజరాజులకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ భద్రత ముందు ఏదైనా సరిపోదని కామెంట్లు పెడుతున్నారు. ఇది Z + + + కేటగిరీ భద్రతలా ఉందంటున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలను షేర్ చేయాలని కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Congress President Election: 'నా వెనుక సోనియా గాంధీ లేరు- అందుకే బరిలోకి దిగాను'
Also Read: Bharat Jodo Yatra: రోడ్డుపై రాహుల్ గాంధీ పుష్ అప్ ఛాలెంజ్- ఉత్సాహంగా జోడో యాత్ర!