Bihar Accident: బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పోలీస్ సిబ్బందితో వెళ్తోన్న బస్సు.. బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇంధన ట్యాంకర్ పేలి ముగ్గురు బస్సు కిందే సజీవ దహనమయ్యారు. ఇంత ప్రమాదం జరిగినా పోలీసులు కనీసం సాయం చేయలేదు.


ఇదీ జరిగింది


చప్రా సివాన్‌ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. బిహార్‌ పోలీస్ సిబ్బందిని తరలిస్తోన్న ఓ బస్సు డియోరియా గ్రామ సమీపంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులను ఢీ కొట్టింది. బైక్‌పై ఉన్న వారిలో ఒకరు బండితో సహా బస్సు కింద ఇరుక్కపోయాడు. 100 మీటర్ల వరకు ఆ వ్యక్తిని బస్సు ఈడ్చుకెళ్లింది. అయితే ఒక్కసారిగా బస్సు ఇంధన ట్యాంకు పేలి మంటలు వ్యాపించాయి. దీంతో బస్సు కింద ఇరుక్కన్న బైకర్‌తో సహా మిగతా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.


పోలీసులు పరార్


బస్సులో మంటలు చెలరేగడంతో పోలీస్‌ అధికారులు వెంటనే బస్సు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. కనీసం ఒక్కరు కూడా కాపాడే ప్రయత్నం చేయలేదు. వెంటనే బస్సు దిగి పోలీసులంతా దూరంగా పారిపోయారు.


సితాబ్దియారాలో దివగంత నేత జయ ప్రకాశ్‌ నారాయణ 120వ జయంతి వేడుకల్లో పాల్గొన్న పోలీస్‌ సిబ్బంది తిరిగి వస్తున్నసమయంలో ఈ ప్రమాదం జరిగింది


Also Read: Trains Cancelled Today: నేడు ఏకంగా 168 రైళ్లు రద్దు, రీషెడ్యూల్ - మీ ట్రైన్‌ను ఇక్కడ చెక్ చేస్కోండి


Also Read: Tamilnadu: బస్టాండ్‌లోనే బాలిక మెడలో పసుపుతాడు, పబ్లిక్ ప్లేస్‌లో కట్టేసిన బాలుడు