Tamilnadu Teens Marriage in Public Place: నేటి యువత ప్రేమ పేరుతో వెర్రి చేష్టలు చేస్తోంది. ప్రేమ మైకంలో పడి వయస్సును మరిచి కొందరు విద్యార్ధిని, విద్యార్ధులు జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. స్కూల్ కి వెళ్ళి చదువుకోవాల్సిన యువతి, యువకులు ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియని వయసులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తల్లిదండ్రులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా ఇంటర్‌ చదివే ఓ బాలిక, ఓ బాలుడు నడి రోడ్డుపై బరితెగించి ప్రవర్తించారు. చదువుపై దృష్టి పెట్టాల్సిన వయసులో ప్రేమకు జైకొట్టారు. అందరూ చూస్తుండగానే ఏకంగా బస్టాండ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది..


తమిళనాడులోని చిదంబరానికి (Chidambaram Teens Marriage) చెందిన ఓ బాలిక ఇంటర్‌ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడు పాలిటెక్నిక్‌ చదువుతున్నాడు. కొద్దిరోజుల క్రితం ఇద్దరూ గాంధీ విగ్రహం దగ్గరలో ఉన్న ఓ బస్టాండ్‌ దగ్గర కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో సదరు బాలుడు, బాలిక మెడలో పసుపు తాడు కట్టాడు. పక్కనే ఉన్న మరికొందరు విద్యార్ధులు వారికి మద్దతుగా అల్లరి చేస్తూ వారిపై పూలు చల్లారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో కాస్తా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆ వీడియోపై అధికారులు సీరియస్‌ అయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా కొద్ది రోజుల క్రితం ఇలాంటి సంఘటనే ఒకటి కడలూర్‌లో వెలుగు చూసింది. ఓ 23 ఏళ్ల వ్యక్తి ఓ మైనర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి జరిగి సంవత్సరం అయింది. అయితే తాజాగా ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువకుడిని, అతడి తండ్రిని అరెస్టు చేశారు.


కాగితపు ముక్కలు చల్లి తోటి విద్యార్థుల అభినందనలు


ఆ సమయంలో ఇద్దరు విద్యార్థులు కూడా వారి స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్‌లోనే ఉన్నారు. తోటి విద్యార్థులు వారిపై పూలకు బదులుగా కాగితాలు చల్లి అభినందనలు తెలిపారు. వీడియోలో ఉన్న విద్యార్థిని పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నట్లు కూడా చెబుతున్నారు. విద్యార్థినికి తాళి కట్టిన విద్యార్థి కీరపాళ్యం సమీపంలోని ఉత్తర హరిరాజపురం ప్రాంతానికి చెందినవాడని సమాచారం. అక్కడే ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్‌లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నట్లుగా తెలుస్తోంది. చాలా మంది నెటిజన్లు. విద్యార్థుల చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 


కడలూరు జిల్లా (Kadalur District) చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఈ ఘటనపై దృష్టిసారించారు. పెళ్లి చేసుకున్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ కేసులో తదుపరి చర్యలపై పోలీసులు సమాలోచనలు జరుపుతున్నారు.


Also Read: Fake Astronaut: ISSలోని ఆస్ట్రనాట్‌తో మహిళ ఛాటింగ్! భూమ్మీదకి వచ్చి పెళ్లాడతానని ప్రామిస్, కోలుకోలేని షాక్