Boycott Maldives Trend:
గూగుల్ సెర్చ్‌లో లక్షద్వీప్ టాప్..
ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తరవాత గూగుల్‌లో Lakshadweep ఒక్కసారిగా ట్రెండ్‌లోకి వచ్చింది. అసలు అక్కడ ఏమేం ఉన్నాయని కొందరు వెతుకుతుంటే..మరికొందరు టూర్‌కి ప్లాన్ చేసేస్తున్నారు. కేవలం ఒకే ఒక్క విజిట్‌తో ప్రధాని మోదీ లక్షద్వీప్ టూరిజంని అలా ప్రమోట్ చేశారు. అందరూ ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు కూడా. కానీ...ఇది మాల్దీవ్స్‌కే మింగుడుపడలేదు. బీచ్ టూరిజంలో తమతో పోటీ పడే వాళ్లే లేరంటూ అక్కడి మంత్రి ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ మిస్‌ఫైర్ అయింది. వెంటనే #boycottmaldives హ్యాష్‌ట్యాగ్‌ని క్రియేట్ చేసి వరుస పెట్టి పోస్ట్‌లు పెడుతున్నారు నెటిజన్లు. ముఖ్యంగా కొందరు సెలెబ్రిటీలు ఈ పోస్ట్‌లు పెట్టడం వల్ల మాల్దీవ్స్‌కి కాస్త గట్టిగానే షాక్ తగిలింది. ఈ సెలెబ్రిటీల లిస్ట్‌లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. గతేడాది ఏప్రిల్‌లో తన 50వ బర్త్‌డేని సింధూదుర్గ్ ఐల్యాండ్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు సచిన్. ఇప్పుడు మాల్దీవ్స్ గురించి డిబేట్ జరుగుతున్న సమయంలోనే ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. సింధూదుర్గ్‌లో ఆతిథ్యం చాలా బాగుందని, ఎన్నో అందమైన జ్ఞాపకాలు అందించిందని చెప్పాడు. అంతే కాదు. భారత్‌లో ఇలాంటి అందమైన ద్వీపాలుండడం మన అదృష్టం అంటూ పరోక్షంగా మాల్దీవ్స్‌కి చురకలు అంటించాడు. పైగా పోస్ట్‌లో చివర #ExploreIndianIslands అని హ్యాష్‌ట్యాగ్ పెట్టాడు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్స్ మద్దతు..
కొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా ఇదే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్‌లు పెడుతున్నారు. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం అతిథి దేవోభవ ఫిలాసఫీ గురించి చెబుతూ లక్షద్వీప్‌ని విజిట్ చేయాలని కోరాడు. లక్షద్వీప్ ఫొటోలు X వేదికగా షేర్ చేశాడు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కూడా ఈ పోస్ట్ పెట్టింది. why not #ExploreIndianIslands అంటూ లక్షద్వీప్ ఫొటో షేర్ చేసింది.
మాజీ ఇండియన్ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా X లో పోస్ట్ పెట్టారు. భారత్‌ని అంతగా ద్వేషిస్తున్న మాల్దీవ్స్‌ని ఎందుకు పట్టించుకోవాలంటూ ప్రశ్నించారు. మాల్దీవ్స్‌కి వెళ్లాలనుకునే భారతీయులు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందని సూచించారు. ఇంకొందరైతే లక్షద్వీప్‌లోని సన్‌రైజ్ ఫొటోలు పెట్టి "ఇలాంటి అందమైన వ్యూ మాల్దీవ్స్‌లో దొరకదు" అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. దాదాపు రెండు రోజులుగా #boycottmaldives ట్రెండ్ అవుతోంది. "మన దగ్గరే ఇంత గొప్ప ద్వీపం ఉండగా..మాల్దీవులకు వెళ్లాల్సిన అవసరం ఏముంది" అంటూ చాలా మంది పోస్ట్‌లు పెడుతున్నారు.
Also Read: బీచ్ టూరిజంలో భారత్ మాతో పోటీ పడలేదు, మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవ్స్ అక్కసు