Modi Lakshadweep Visit:
మాల్దీవ్స్ అసహనం..
ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై (PM Modi Lakshadweep Visit) మాల్దీవ్స్ గుర్రుగా ఉంది. మాల్దీవ్స్ మంత్రి ఒకరు ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వివాదానికి దారి తీసింది. మోదీ లక్షద్వీప్ పర్యటన వెనక ఉద్దేశం టూరిజం రంగాన్ని ప్రోత్సహించాలనే. అయితే...దీనిపై స్పందిస్తూ బీచ్ టూరిజంలో భారత్ మాల్దీవ్స్‌ని ఎప్పటికీ దాటలేదని, చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. మాల్దీవ్స్ అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజూ (Mohamed Muizzu) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్‌పై ఏదో విధంగా విమర్శలు చేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో ముయిజూ అధ్యక్ష పదవిని చేపట్టారు. అంతకు ముందు ఎన్నికల ప్రచారం నుంచే భారత్‌పై విషం కక్కారు. తమ ద్వీపంలో భారత్‌కి చెందిన 75 మంది సైనికులను పంపేయడంతో పాటు ఇప్పటి వరకూ అనుసరించిన India first పాలసీనీ పక్కన పెట్టేస్తాని హామీ ఇచ్చారు. అంతే కాదు. చైనాకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే మహమ్మద్ ముయిజూ చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇప్పటికే ఆయనకు ఆహ్వానం పంపారు. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి అధికారిక ప్రకటన చేశారు. మాల్దీవ్స్‌కి 8వ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ముయిజూ చైనాతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతకు ముందు అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ భారత్‌తో మైత్రి కొనసాగించారు. కానీ...ముయిజూ మాత్రం ఈ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
మైత్రి కొనసాగేనా..?
చైనా, మాల్దీవ్స్ మధ్య దాదాపు 52 ఏళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఎవరి ప్రయోజనాలు వాళ్లు చూసుకుంటూనే మైత్రి సాగించాయి. అంతే కాదు. అంతకు ముందు మాల్దీవుల అధ్యక్షులు భారత్‌లో పర్యటించారు. కానీ...చైనా ఇక్కడ ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుండడం వల్ల ప్రస్తుత అధ్యక్షుడు ఆ దేశంతో మైత్రికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. గతేడాది డిసెంబర్‌లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయి. మాల్దీవ్స్‌లో ఉన్న 75 మంది భారతీయ సైనికులను ఉపసంహరించుకోవాలని ఆ సమయంలోనే కోరారు మహమ్మద్. కానీ ఈ విషయంలో ఎలాంటి ఒప్పందం జరగలేదు. ఈ సమయంలోనే ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించడంపై మాల్దీవ్స్ అసహనం వ్యక్తం చేసింది.
ధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) లక్షద్వీప్ (Lakshadweep)లో రెండు రోజుల పాటు పర్యటించారు. ప్రకృతి అందాలను ఆస్వాదించారు. సముద్రంలో స్నార్కెలింగ్ కూడా చేశారు. ప్రధాని మోడీకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు రోజుల అధికారిక పర్యటనలో ఎక్కువ సమయం...లక్ష్యదీప్ ప్రకృతి అందాలను ప్రపంచానికి తెలియజేయడానికి తహతహలాడారు. స్విమ్మింగ్ చేయడం, సముద్రంలో నీటి అలల అంచున కుర్చీ వేసుకొని కూర్చుకోవడం...నడుచుకొని వెళ్లడం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తన పర్యటన విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. లక్షద్వీప్ సౌందర్యం, ప్రజలు చూపించిన తనను ఎంతో ఆకర్షించిందన్నారు. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం ఉన్న లక్ష్యద్వీప్ దీవులు...పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయని రాసుకొచ్చారు. అక్కడితో ఆగని మోడీ...పర్యాటకలకు సలహా కూడా ఇచ్చారు. సాహాసాలు చేయలనుకునే వారంతా... లక్ష్యద్వీప్ ను జాబితాలో పెట్టుకోవాలంటూ సలహా కూడా ఇచ్చారు.
Also Read: భారత్‌తో మైత్రి మా అదృష్టం, ఆపదలో మాకు అండగా నిలిచింది - బంగ్లాదేశ్ ప్రధాని