Prajwal Revanna Mother bhavani revanna: కర్ణాటకలో సంచలనంగా మారిన ప్రైవేట్ వీడియోల స్కాండల్‌లో ఇరుక్కున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణ ఆచూకీ తెలియడం లేదు. ఆమె తన ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయారు. ఆమెను విచారించేందుకు సిట్ హాసన్ జిల్లా హోలెనర్సిపురాలోని ఆమె ఇంటికి చేరుకుంది. అయితే అప్పటికే ఆమె ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయారు. సాయంత్రం వరకు పోలీసులు ఆమె కోసం వేచి చూశారు. జూన్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తన ఇంటికి హాజరు కావాలని భవానీ రేవణ్ణకు సిట్ గురువారం నోటీసులు పంపింది. తన కుమారుడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక దోపిడీ, కిడ్నాప్ ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆమెను విచారించాల్సి ఉందని తెలిపింది.
భారత్ తిరిగొచ్చిన ప్రజ్వల్ రేవణ్ణ
భవానీ రేవణ్ణ ఇల్లు ‘చెన్నాంబిక నిలయ’కు సిట్ అధికారులు చేరుకోగా, ఆమె అక్కడ లేరు. ఇప్పుడు ఆమె కోసం బృందాలను ఏర్పాటు చేయాలని సిట్ పరిశీలిస్తోంది. అదే సమయంలో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ప్రజ్వల్ రేవణ్ణ శుక్రవారం జర్మనీ నుంచి భారత్‌కు తిరిగొచ్చారు. అయితే బెంగుళూరు విమానాశ్రయంలో సిట్ అతన్ని అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ కూడా చిక్కుకున్నారు. ఒక మహిళను కిడ్నాప్.. వందలాది మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
పలు సెక్షన్ లపై కేసు నమోదు
ఏప్రిల్ 28న కర్ణాటకలోని హోలెనరసిపుర టౌన్ పోలీస్ స్టేషన్‌లో హెచ్‌డీ రేవణ్ణ, ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదైంది. అనంతరం ఈ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించారు. ఆమె హెచ్‌డి రేవణ్ణ, ప్రజ్వల్‌లపై ఐపిసి సెక్షన్‌లు 354 (ఎ) అంటే లైంగిక దోపిడీ, 354 (డి)ఫాలో కావడం, 506 చంపేస్తానని బెదిరించడం, 509 మాటలు లేదా సంజ్ఞల ద్వారా మహిళను అవమానించడం వంటి కేసులను నమోదు చేసింది.
పని పై వచ్చిన వారి బలిపశువులను చేసి
హెచ్‌డి రేవణ్ణ, ప్రజ్వల్ రేవణ్ణ బాధితులైన చాలా మంది బాలికలు, మహిళల్లో ఏదో ఒక రాజకీయ ఆశయం కోసం లేదా ఏదైనా పని కోసం వారిని కలవడానికి వచ్చే అమ్మాయిలు కూడా ఉన్నారని కర్నాటక పోలీసులు తెలిపారు. ఈ బాలికల్లో కొందరు జిల్లా పంచాయతీ సభ్యులు, పోలీసులు, అనేక ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కూడా ఉన్నారు. అతడు వారిని తన అవసరాలకు వాడుకున్నాడని ఆరోపణలున్నాయి.
బట్టలిప్పమని బలవంతం చేశాడు
హెచ్‌డీ రేవణ్ణ తన భార్య ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత స్టోర్‌రూమ్‌కు పిలిచేవాడని రేవణ్ణ కుటుంబంలో వంటమనిషిగా పనిచేస్తున్న ఓ మహిళ వెల్లడించారు. ఆ సమయంలో వారిని అనుచితంగా తాకడానికి ప్రయత్నించే వాడు. చీర పిన్ను తీసి ఆమెను లైంగికంగా వేధించేవాడు. అంతేకాదు ప్రజ్వల్ తన కూతురికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడేవాడు. దీంతో విసిగిపోయిన ఆమె తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. బాధితురాలు ప్రజ్వల్ ఇంట్లో అందుకే పనిమానేసినట్లు పనిమనిషి తెలిపింది. బాధితురాలి కుమార్తె సిట్‌కు తెలిపిన వివరాల ప్రకారం.. "ప్రజ్వల్ నాకు ఫోన్ చేసి బట్టలు విప్పమని అడిగాడు. అతను మా అమ్మ మొబైల్‌కి కాల్ చేసి వీడియో కాల్స్ చేయమని బలవంతం చేసేవాడు. నేను నిరాకరించడంతో అతను నన్ను, మా తల్లిని బెదిరించాడు. మా కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. వారు మాకు మద్దతు ఇచ్చారు. దీంతో మేము ఫిర్యాదు చేసాం’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.