ఝార్ఖండ్​లో ఓ మహిళ.. రైలులోనే.. బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అధికారులు.. మహిళ కోసం రెండు కిలోమీటర్లు.. ట్రైన్ ను వెనక్కు పంపించారు.
అసలేం జరిగిందంటే..
రాణు దాస్ అనే మహిళ ఒడిశా వెళ్తుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్​ప్రెస్ లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తోంది. రైలు దిల్లీ నుంచి వస్తోంది. బుధవారం తెల్లవారుజామున జంషెడ్​పుర్ సమీపంలోని టాటానగర్ స్టేషన్​కు వచ్చింది. 4.10 గంటల సమయానికి ప్లాట్​ఫాం నుంచి బయలుదేరింది. స్టేషన్ దాటిన తర్వాత.. కాసేపటికే గర్భిణీకి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఏం చేయాలో కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు.


చేసేదేమీ లేక.. రైలు చైన్ లాగారు. పురిటి నొప్పులు ఎక్కువై.. మహిళ అక్కడే ప్రసవించింది. రైలు ఆగిన విషయాన్ని.. ఆర్పీఎఫ్ సిబ్బంది.. గమనించారు.  రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే టాటా నగర్ రైల్వేస్టేషన్ దాటి రెండున్నర కిలోమీటర్లు వెళ్లింది రైలు. అయితే నెక్ట్స్ వచ్చే.. స్టేషన్ హిజ్లి. అక్కడకు చేరుకోవాలంటే... దాదాపు 150 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంది. కనీసం రెండు మూడు గంటల సమయం పడుతుంది. ఈ విషయాన్ని ఆలోచించిన అధికారులు.. రెండు కిలోమీటర్ల దూరం ఉన్న టాటానగర్ స్టేషన్ కు రైలును వెనక్కు పిలిపించారు. అక్కడి నుంచి ఆసుపత్రికి పంపించారు. ప్రస్తుతం.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.


కిందటి ఏడాది విమానంలో ఓ మహిళ


కిందటి ఏడాది కూడా అక్టోబర్ నెలలోనే ఇలాంటి ఘటనే జరిగింది. దిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో 6 ఇ 122 విమానంలో గర్భంతో ఉన్న మోనిక..  ప్రయాణించింది. విమానం టేకాఫ్ అయిన 15 నిమిషాల్లోనే ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీనిని డాక్టర్ శైలజ గుర్తించింది. డాక్టర్ శైలజ క్యాబిన్ సిబ్బందిని అప్రమత్తం చేసింది. "ఆమెకు డెలివరీ పెయిన్స్ వస్తున్నాయని నాకు అర్థమైంది. దీంతో శానిటైజేషన్ చేసుకొని, పీపీఈ కిట్లు ధరించి డెలివరీ ప్రక్రియను ప్రారంభించాను. మోనికను టాయిలెట్ సీటుపై కూర్చోబెట్టాను. శిశువు తల బయటకు వచ్చాక, ఆమె పొత్తికడుపును నొక్కుతూ డెలివరీ చేశాను. నెలలు నిండకముందే పుట్టిన ఆ మగ శిశువు సుమారు 1.82 కిలోల బరువు ఉంది.' అని అప్పుడు డాక్టర్ శైలజా చెప్పారు. అప్పట్లో డాక్టర్ శైలజపై ప్రశంసల వర్షం కురిపించారు.


Also Read: Agni-5 Missile Launch: అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సక్సెస్.. చైనాలోని ప్రధాన ప్రాంతాలను ఛేదించగల మిస్సైల్!


Also Read: Aryan Khan Bail Hearing: ఆర్యన్ ఖాన్‌కు మరో 'సారీ'.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా


Also Read: Pradhan Mantri Garib Kalyan Package: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో 6 నెలలపాటు పాలసీ కొనసాగిస్తూ కీలక నిర్ణయం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి