Agni-5 Missile Launch: భారతదేశం అస్త్రాలకు మరింత పదును పెడుతోంది. ఓవైపు రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. దశల వారీగా భారత్‌కు ఫ్రాన్స్ నుంచి రాఫెల్ ఫైటర్ జెట్లు చేరుకుంటున్నాయి. మరోవైపు దేశంలో అగ్ని క్షిపణులను ఎప్పటికప్పుడూ పరీక్షిస్తోంది. తాజాగా చేసిన మరో క్షిపణి పరీక్ష విజయవంతమైంది.


భారత్ చేపట్టిన అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే అగ్ని 5 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగిస్తారు. దీని రేంజ్ దాదాపు 5,000 కిలోమీటర్లు. అగ్ని 1, అగ్ని 2 నుంచి తాజాగా అగ్ని 5 ప్రయోగించింది భారత్. తాజా బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం, రేంజ్ చైనాలోని కీలక ప్రాంతాలను టార్గెట్ చేయగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 


Also Read: తెలుగువారు ఎక్కువగా కొంటున్న ఉత్పత్తులపై అమెజాన్‌ ఆఫర్లు.. ఏంటో తెలుసా?






రక్షణ రంగంలో భారతదేశం మరో పెద్ద విజయం సాధించింది. ఈ ఖండాంతర క్షిపణిని బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలామ్ దీవి (వీలర్ ఐలాండ్) నుంచి ప్రయోగించారు. డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (DRDO) ప్రయోగించిన అగ్ని 5లో మూడు దశల ఘన ఇంధన ఇంజిన్‌ను అమర్చారు. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించేలా ఈ క్షిపణిని రూపొందించారు. 


Also Read: 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు కూడా!


అగ్ని-5 ఖండాతర బాలిస్టిక్‌ క్షిపణిని డీఆర్‌డీఓ, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. 2020లోనే ఈ మిస్సైల్ పరీక్షించాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా వేశారు. అగ్ని 5 క్షిపణి భారత్ రూపొందించిన అత్యంత అధునాతన క్షిపణి, అత్యంత దూరాన్ని అలవోకగా చేధించగల భారత బాలిస్టిక్ మిస్సైల్ గా అగ్ని 5 నిలిచింది. అగ్ని 5 క్షిపణి పొడవు 17 మీటర్లు కాగా, 2 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. చైనా, పాక్‌లతో ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించడం కనుక భారత్ తన అస్త్రాలకు పదును పెడుతోంది. సరికొత్త ఆయుధాలు, అస్త్రాలను సంసిద్ధం చేసుకుంటోంది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి