వాట్సాప్ ( WhatsApp ) సంస్థ ఎడాపెడా వినియోగదారుల ఖాతాలను బ్లాక్ చేస్తోంది. ఒక్క మార్చి ( March ) నెలలోనే 18.05 లక్షల భారతీయ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. తన నెలవారీ నివేదిక ద్వారా వాట్సాప్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫిర్యాదుల విభాగం ద్వారా వినియోగదారులు చేసిన ఫిర్యాదుల ఆధారంగానూ, నిబంధనల ఉల్లంఘనలను నిరోధించడానికి, గుర్తించడానికి తాను సొంతంగా ఏర్పాటు చేసుకున్న యంత్రాంగం ఆధారంగానూ ఈ నిషేధం విధించినట్లు వాట్సాప్ స్పష్టం చేసింది. గతేడాది నుంచి అమల్లోకి వచ్చిన నూతన ఐటి నిబంధనల ( New IT Rules ) ప్రకారం భారీ డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్స్ అంటే 50 లక్షలకు పైగా వినియోగ దారులు ఉన్నవి తప్పనిసరిగా ప్రతినెలా నివేదికను వెల్లడించాలి. వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలను తెలపాలి.
కర్ణాటకలో మళ్లీ సీఎం మార్పు! అమిత్ షా పర్యటన వేళ గుసగుసలు!
ప్రభుత్వం ( Governament ) తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం వాట్సాప్ ఈ నివేదికను వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి 31 వరకూ 18.05 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తన నివేదికలో తెలిపింది. వినియోగదారులను ( Customers ) సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నట్లు వాట్సాప్ పేర్కొంది. ఫిబ్రవరి నెలలో 14.26 లక్షల భారతీయ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. చాలా మంది వాట్సాప్ వినియోగదారులు హఠాత్తుగా తమ ఖాతా ఎందుకు నిలిచిపోయిందో తెలియక టెన్షన్ పడుతూ ఉంటారు. హ్యాక్ చేశారని అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటిదేమీ ఉండదని.. సంస్థే బ్యాన్ చేస్తుంది.
ఆ చిటికెలు చిటికెలు- మోదీ మనసు దోచిన చిన్నారి- ఏం పాడినవ్ రా బుడ్డోడా!
వాట్సాప్ లేకుండా ఇప్పుడు ఒక్క స్మార్ట్ ఫోన్ ( Smart Phone ) కూడా ఉండదు. చదువు రాని వారు కూడా వాట్సాప్ విరివిగా వాడుతున్నారు. అయితే మెసెజింగ్ ఫ్లాట్ ఫామ్ ఎంత ఉపయోగకరమో.. ఫేక్ న్యూస్ వ్యాప్తికి అంత డేంజరస్ కూడా. అందుకే ప్రభుత్వం పలు రకాల నిబంధనలు తీసుకు వచ్చింది. వాట్సాప్ కూడా ఫార్వార్డ్ ( WhatsApp Rules ) నిబంధనలు మార్చింది. ఏదైనా మెసెజ్ ఒకే సారి అన్నిగ్రూపులకు పంపడానికి లేకుండా కట్టడి చేసింది. వాట్సాప్ రూల్స్ పై స్పష్టమైన అవగాహన లేని వారు చేసే తప్పుల వల్ల ఎక్కువగా వాట్సాప్ బ్యాన్ అవుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏ సమస్యా ఉండదు.