Republic Day 2025 : దేశ రాజధాని ఢిల్లీలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 2025 ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా భారత వైమానిక దళ (IAF) ప్రదర్శన చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఐఏఎఫ్ ఫ్లైపాస్ట్ కీలక పాత్ర పోషించగా.. 129 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన నాలుగు Mi-17 హెలికాప్టర్స్ ఆర్మీ, నేవీ, వైమానిక దళానికి చెందిన సంబంధిత సేవా జెండాలతో పాటు కర్తవ్య పథ్ లో పూల రేకులు కురిపిస్తూ జాతీయ జెండా చుట్టూ తిరిగాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన ధ్వజ్ నిర్మాణం (Dhwaj Formation) స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సాధారణంగా ఈ ధ్వజ్ (జెండా) నిర్మాణాన్ని రిపబ్లిక్ డే వేడుకలు, ఎయిర్ షోలు లాంటి ఇతర వేడుకల్లో భాగంగా ప్రదర్శిస్తారు. ఇది భారతదేశ వైమానిక శక్తిని,  భారత సైనిక విమానాల సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. అయితే ఈ ధ్వజ్ ఫార్మేషన్ అంటే ఏంటీ.. దీని అర్థం ఏంటీ.. ఎలా ప్రదర్శిస్తారు లాంటి కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ధ్వజ్ ఫార్మేషన్ అంటే..

గణతంత్ర దినోత్సవ వేడుకలలో భారత వైమానిక దళం ఆకాశంలో విలోమ Y ఆకారాన్ని నిర్మిస్తూ పరేడ్ లో పాల్గొంది. సాధారణంగా ఈ నిర్మాణాలను Mi-17 IV లేదా చేతక్ హెలికాప్టర్లు ఏర్పరుస్తాయి. ఈ ఏర్పాటు ఐఏఎఫ్ సాంకేతిక నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా దేశ రక్షణ పట్ల దాని నిబద్ధతను కూడా చూపుతుంది. ఈ సారి నిర్వహించిన ధ్వజ్ ఫార్మేషన్ లో  4 Mi-17 ఛాపర్స్ పాల్గొన్నాయి. ఈ నిర్మాణానికి గ్రూప్ కెప్టెన్ అలోక్ అహ్లావత్ నాయకత్వం వహించారు. వాస్తవానికి ధ్వజ్ పేరులో సూచించినట్టుగానే ఇది జెండా నిర్మాణాన్ని సూచిస్తుంది. ఇక ఈ ధ్వజ నిర్మాణ ప్రధాన ఉద్దేశమేమిటంటే, జాతీయ జెండాను, ఐఏఎఫ్ చిహ్నాన్ని గౌరవించడం. సాయుధ దళాల సిబ్బంది చేసిన, చేస్తోన్న త్యాగాలకు గుర్తుగా, పౌరుల్లో దేశ భక్తిని ప్రేరేపించే లక్ష్యంతో ఈ వైమానిక ప్రదర్శన చేస్తారు. ఈ ప్రదర్శనతో పాటు అదే సమయంలో హెలికాప్లర్ల నుంచి భూమిపైకి పూల రేకులకు వదులుతారు. ఇది వేడుకల గొప్పతనాన్ని మరింత పెంచుతుంది. ఈ ధ్వజ్ నిర్మాణాన్ని భారత వైమానిక దళం శక్తిని ప్రదర్శించే ముఖ్యమైన సంఘటనల సమయంలో ప్రదర్శిస్తారు. వాటిలో.. గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఇతర ఎయిర్ షోలు వంటివి ఉంటాయి.

చెన్నై ఎయిర్ షో: అక్టోబర్ 6, 2024న, చెన్నైలో జరిగిన ఎయిర్ షోలో 4 చేతక్ హెలికాప్టర్లు ధ్వజ్ ఫార్మేషన్‌ను అమలు చేశాయి. ఈ ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ధ్వజ్ ఏర్పాటుకు ఎవరు నాయకత్వం వహిస్తారంటే..

సాధారణంగా, ధ్వజ్ ఏర్పాటుకు గ్రూప్ కెప్టెన్ వంటి సీనియర్ అధికారి నాయకత్వం వహిస్తారు. ఇది ఐఏఎఫ్ సిబ్బందిలో జట్టు కృషిని, ఖచ్చితత్వానికి ఉదాహరణగా నిలుస్తుంది. సంక్లిష్టమైన విన్యాసాలను అమలు చేస్తున్నప్పుడు ప్రతి విమానం కఠినమైన ప్రోటోకాల్‌లు, భద్రతా చర్యలకు కట్టుబడి ఉండేలా అధికారి నాయకత్వం వహిస్తారు. ఇది ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లలో ఫ్లైపాస్ట్‌లో పాల్గొంటుంది. కాబట్టి ఈ నిర్మాణం చాలా ముఖ్యమైనది.

Also Read : Batool Begum : రాముని కీర్తనలు పాడే బతూల్ బేగంను వరించిన పద్మశ్రీ - ఇంతకీ ఆమె ఎవరంటే..