Hottest March India: ఆ నెల చాలా హాట్ గురూ! 122 ఏళ్ల రికార్డ్ బద్దలు

ABP Desam   |  Murali Krishna   |  03 Apr 2022 03:15 PM (IST)

గత 122 ఏళ్లలో నమోదుకాని ఉష్ణోగ్రతలు ఈ ఏడాది మార్చిలో నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఆ నెల చాలా హాట్ గురూ! 122 ఏళ్ల రికార్డ్ బద్దలు

దేశంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది మార్చిలో 122 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గత నెలలో దేశంలోని చాలా భాగంలో తీవ్ర వేడిగాలులు వీచాయని పేర్కొంది.

దేశంలో 33.10 డిగ్రీల సరాసరి గరిష్ట ఉష్ణోగ్రత మార్చి 2022లో నమోదైంది. గత 122 ఏళ్లలో ఇదే అత్యధికం. దేశంలో 2010 మార్చిలో 33.09 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతగా నమోదైంది.                                                                   -  భారత వాతావరణ శాఖ (ఐఎండీ)

అత్పల్ప వర్షపాతం

ఉత్తర, దక్షిణ భారతదేశంలో చురుకైన పశ్చిమ పవనాలు లేకపోవడం, అల్ప వర్షపాతమే ఇందుకు కారణమని విశ్లేషించింది. దీర్ఘకాలం సరాసరి వర్షపాతం 30.4 మిల్లీమీటర్లు కాగా, ఈసారి 71% తక్కువగా 8.9 మి.మీ. మాత్రమే నమోదైందని వివరించింది. 1908 తర్వాత ఇదే అత్యల్ప వర్షపాతమని తెలిపింది.

జమ్ము, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఝార్ఖండ్, రాజస్థాన్, ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్ మీదుగా రానున్న రెండు నుంచి నాలుగు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని పేర్కొంది. మరోవైపు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఏప్రిల్ 2 నుంచి 4 మధ్య భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపింది.

భారీ ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. 

ఇకనుంచి 41 నుంచి 45 డీగ్రీల మధ్యలో ఎండలు ఉంటాయని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ కేంద్రం కొన్నిజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, అధిక ప్రభావం ఉండే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఎండల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. మధ్యాహ్నం సమయం ఎండలు, వేడి గాలులు ఎక్కువగా ఉంటాయని అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వాతావరణ కేంద్రం సూచించింది.

Also Read: Viral: రూ.85కే ఇల్లు కొన్నాడు, ఇప్పుడు అమ్మేశాడు, ఎంత ధరకో తెలిస్తే షాక్ తింటారు

Also Read: Optical Illusion: ఈ ఫోటోలో మీకు ఏం కనిపిస్తోందో చెప్పండి, మీరెలాంటి వ్యక్తిత్వం కలవారో తెలిసిపోతుంది

Published at: 03 Apr 2022 03:15 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.