సాధారణంగా చిత్రాల్లోనే చేజింగ్ సీన్ చూసుంటారు. అయితే దిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో ఓ ఐదుగురు దొంగలను దాదాపు 22 కిమీ చేజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు. ఓ ట్రక్‌లో పశువులను దొంగిలించి పట్టికెళ్తున్న వీరిని మూవీ స్టైల్‌లో చేజ్ చేసి పట్టుకున్నారు. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.


ఏం జరిగింది?






ఓ ఐదుగురు దొంగలు ఆవులను ట్రక్కులో తరలిస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, గో సంరక్షకులు వారిని వెంబడించారు. ఇది గమనించిన దొంగలు ఇంకా వేగంగా వాహనాన్ని నడిపారు. వారి వద్ద దేశవాళీ తుపాకులు, బుల్లెట్లు కూడా ఉన్నాయి. అయితే పోలీసులు దగ్గరికి రావడం గమనించిన దుండగులు.. నడుస్తోన్న వాహనం నుంచే ఆవులను కిందకు తోసేసారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది.


దిల్లీ సరిహద్దు నుంచి గురుగ్రామ్ వచ్చిన ఈ వాహనాన్ని తనిఖీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా దొంగలు వేగంగా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు 22 కిమీ చేజ్ చేశారు. వేగానికి టైర్లు పంక్చరైనా వాహనాన్ని దొంగలు ఆపలేదు.


తుపాకీలు


అయితే ఎట్టకేలకు పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారు. వారి వద్ద నుంచు తుపాకీలు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.


ఆవుల దొంగతనం, అక్రమ తరలింపును అడ్డుకునేందుకు హరియాణా సర్కార్ కట్టుదిట్టమైన చట్టాలు తీసుకువచ్చింది. గో రక్షణ కోసం ఓ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. భాజపా ప్రభుత్వం గోవధ నిషేధ చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి బడుగు రైతుల బక్కచిక్కిన ఆవులు అమ్ముడు పోవడం లేదు. నేటి కరువు పరిస్థితుల్లో వాటిని పోషించలేక గో సంరక్షణ శాలలకు వాటిని తరలిస్తున్నారు. అక్కడి నిర్వాహకులకు కూడా గోవుల సంరక్షణ భారం కావడంతో రైతుల ఆవులు స్వీకరించేందుకు వారూ నిరాకరిస్తున్నారు.


ఈ చట్టం వచ్చినప్పటి నుంచి గో సంరక్షణ శాలలను నిర్వహించడం తమకు తలకుమించిన భారం అవుతోందని గోశాలల నిర్వాహకులు అంటున్నారు. 


Also Read: Covid 19 Precaution Dose: ప్రికాషన్ డోసు షురూ- ఎలా బుక్ చేసుకోవాలి? ధర తెలుసుకోండి


Also Read: Optical illusion: తెలివైన వారే ఇందులో ఎన్ని ముఖాలు ఉన్నాయో చెప్పగలరు, కొంచెం కష్టమే కానీ అసాధ్యం కాదు