Viral Video: 


 
కార్‌పై బాణసంచా..


Viral News: ఢిల్లీ, NCR ప్రాంతాల్లో తీవ్ర కాలుష్యం (Delhi Pollution) కారణంగా ఈ సారి దీపావళికి బాణసంచా కాల్చడంపై నిషేధం విధించారు. అయినా కొందరు ఈ రూల్‌ని పక్కన పెట్టారు. ఇంకొందరైతే...మరీ ఉత్సాహం ఆపుకోలేక రోడ్లపైనే క్రాకర్స్‌ (Crackers on Car) కాల్చేశారు. గుడ్‌గావ్‌లో ఓ వ్యక్తి కార్‌పై క్రాకర్స్‌ పెట్టి కాల్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అత్యంత ప్రమాదకరంగా కార్‌ని వేగంగా నడుపుతూ దానిపైనే బాణసంచా కాల్చారు కొందరు ఆకతాయిలు. పైగా సన్‌రూఫ్‌లో నుంచి తల బయటపెట్టి గట్టిగా కేకలు వేశారు. అయితే...పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అన్నభయంతో  ముందుగానే నంబర్‌ ప్లేట్స్ కనబడకుండా జాగ్రత్తపడ్డారు. వెనకాల వచ్చే వెహికిల్స్‌లోని వ్యక్తులు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోని చూసిన హరియాణా పోలీసులు విచారణ మొదలు పెట్టారు. 


"సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. దీనిపై పూర్తి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. కొంత మంది వాహనాలను ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. రోడ్‌పై న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. విచారణ కొనసాగుతోంది. నిందితులెవరైనా సరే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. మరి కొన్ని చోట్ల కూడా ఇలాంటి ఘటనలే జరిగాయని మా దృష్టికి వచ్చింది. CCTV సహా మిగతా సోర్స్‌ల ద్వారా సమాచారాన్ని సేకరిస్తాం"


- పోలీసులు






అటు తమిళనాడులోనూ కొందరు ఇలానే రచ్చ చేశారు. బైక్‌పై క్రాకర్స్‌ కాల్చి నానా హంగామా సృష్టించారు. ఈ వీడియో కూడా వైరల్ అయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. 






ఢిల్లీలో ఓ ఫ్లైఓవర్‌పై పోలీస్ బారికేడ్‌ని కార్‌తో ఢీకొట్టి లాక్కెళ్లాడు ఓ వ్యక్తి. అదే రోడ్‌పై వస్తున్న మరో వ్యక్తి ఆ తతంగాన్ని వీడియో తీశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. బ్లూ కలర్ స్విఫ్ట్ కార్ బారికేడ్‌ని బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఆ బారికేడ్‌ కార్‌కి ఇరుక్కుపోయింది. కింద వీల్స్ ఉండడం వల్ల కార్‌తో పాటు చాలా దూరం ముందుకు వెళ్లిపోయింది. ఎప్పుడైతే ఆ వీల్స్‌ విడిపోయాయో అప్పుడు కార్ నుంచి విడిపోయి కింద పడిపోయింది. ఆ తరవాత కార్‌ ఆగిపోయింది. అయితే...ఈ వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకున్నారా లేదా అన్నది ఇంకా తెలియలేదు. అసలు ఈ ఘటనపై కేసు నమోదైందా అన్నదీ క్లారిటీ లేదు. సాధారణంగా రోడ్‌లపై ర్యాష్‌ డ్రైవింగ్‌ని కట్టడి చేసేందుకు పోలీసులు బారికేడ్‌లు అడ్డంగా పెడతారు. డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్‌ వే డ్రైవింగ్‌ని నియంత్రించేందుకూ ఇవి ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా రాత్రి పూటే కీలకమైన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. అయితే...ఈ ఘటన జరిగే సమయానికి అక్కడ పోలీసులు ఎవరూ లేరు.


Also Read: Uttarkashi Tunnel Collapse: ఉత్తరకాశీ సొరంగంలో మరో సారి కూలిన కొండ చరియలు, కార్మికులను రక్షించేందుకు కొత్త ప్లాన్