Returning Officer for Vice Presidential Election of India | న్యూఢిల్లీ: ఇటీవల జగదీప్ ధన్‌ఖర్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాల్లో మార్పు మొదలైంది. ప్రతిపక్షాలు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. త్వరలో దేశానికి కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నిక రానున్నారు. ఎన్నికల సంఘం ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ మొదలుపెట్టింది. ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీని ఎన్నికల కమిషన్ నియమించింది. ఈ విషయాన్ని శుక్రవారం (జూలై 25)న ఒక పత్రికా ప్రకటన ద్వారా ఎన్నికల కమిషన్ తెలిపింది.
ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో ఇలా పేర్కొంది. "రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల చట్టం, 1952లోని సెక్షన్ 3 ప్రకారం, ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించింది. దీని ఆఫీసు న్యూఢిల్లీలో ఉంటుంది. కమిషన్ సహాయ రిటర్నింగ్ అధికారిని కూడా నియమించవచ్చు" ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది.
రిటర్నింగ్ అధికారిగా ఎవరికి అవకాశం
లోక్‌సభ ప్రధాన కార్యదర్శి లేదా రాజ్యసభ ప్రధాన కార్యదర్శిని రొటేషన్ పద్ధతిలో రిటర్నింగ్ అధికారిగా నియమిస్టుంటారు. గత ఉప రాష్ట్రపతి ఎన్నికల సమయంలో లోక్‌సభ ప్రధాన కార్యదర్శిని రిటర్నింగ్ అధికారిగా నియమించారు. ఎన్నికల సంఘం ఇంకా ఉప రాష్ట్రపతి ఎన్నికల తేదీని ప్రకటించలేదు, కానీ త్వరలో ఎన్నిక తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
ఉప రాష్ట్రపతి పదవికి పోటీలో ఎవరున్నారు?
ఉప రాష్ట్రపతి పదవికి భారతీయ జనతా పార్టీ (BJP) ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే రేసులో ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ముందున్నారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ రేసులో ఉన్నారు. జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్, ఓం మథుర్‌లు సైతం ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్థులుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన సిక్కిం గవర్నర్‌గా ఉన్నారు.
జగదీప్ ధన్‌ఖడ్ ఎందుకు రాజీనామా చేశారు..
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు. ఆరోగ్య కారణాల వల్ల ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. రాజ్యాంగంలోని సంబంధిత సెక్షన్ ప్రకారం రాజీనామా చేశానని, రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపినట్లు చెప్పారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని రాజకీయం చేస్తున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, ఆయన రాజీనామాకు కారణం ఇదేనని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
1. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం, భారత ఉపరాష్ట్రపతి ఎన్నికను నిర్వహించే బాధ్యత భారత ఎన్నికల సంఘానికి ఉంది. ఈ ఎన్నికలు “భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం, 1952” మరియు “ఎన్నికల నియమాలు, 1974” ప్రకారం నిర్వహిస్తారు.
2. పై చట్టం ప్రకారం, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఎన్నికల సంఘం ఒక రిటర్నింగ్ అధికారిని, అవసరమైతే సహాయక అధికారులను కూడా నియమించవచ్చు. ఎన్నికల్లో ఈ బాధ్యతను లోక్‌సభ కార్యదర్శి, రాజ్యసభ కార్యదర్శి తీసుకుంటారు. గత ఉపరాష్ట్రపతి ఎన్నికలో లోక్‌సభ కార్యదర్శి జనరల్ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు.
3. అందువల్ల, ఈసారి కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖతో సంప్రదించి రాజ్యసభ ఛైర్మన్ అంగీకారంతో, రాజ్యసభ కార్యదర్శిని ఉపరాష్ట్రపతి ఎన్నిక 2025కు రిటర్నింగ్ అధికారిగా నియమించింది.
4. అదనంగా గరీమా జైన్, సంయుక్త కార్యదర్శి, విజయ్ కుమార్, డైరెక్టర్ – ఇద్దరూ రాజ్యసభకు చెందినవారు. ఈ ఎన్నిక కోసం సహాయక రిటర్నింగ్ అధికారులుగా నియమితులయ్యారు. 5. సంబంధిత గజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశాం అని డిప్యూటీ డైరెక్టర్ పి. పవన్ పేర్కొన్నారు.