Monsoon Destinations in Maharashtra : వర్షాలు పడే సమయంలో ప్రకృతిని చూడాలి.. ఎంజాయ్ చేయాలని ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీరు వేరే దేశం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే మహారాష్ట్రకి ట్రిప్‌కి వెళ్లొచ్చు. ఇక్కడ మిమ్మల్ని ప్రకృతితో కట్టిపడేసే దృశ్యాలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్రదేశాలు మీకు మంచి ఆహ్లాదాన్ని ఇస్తాయి. అయితే మీరు మహారాష్ట్ర వెళ్తే.. తప్పకుండా చూడాల్సిన 8 బెస్ట్ స్పాట్స్ ఇవే.
లోనావల & ఖండాలా (Lonavala & Khandala)
లోనావల, ఖండాలా అనేది మోస్ట్ పాప్యులర్ రొమాంటిక్, ఫ్యామిలీ డెస్టినేషన్‌గా ఎన్నో ఏళ్ల నుంచి గుర్తింపు పొందింది. ఇక్కడ మీరు బుషీ డ్యామ్, టైగర్ లీప్, రాజ్మాచీ కోట, లోహగడ్ ట్రెక్కింగ్‌కి వెళ్లొచ్చు. చాయ్-పకోడి స్టాల్స్ బాగా ఆకట్టుకుంటాయి.
సవియా ఘాట్ (Saviya Ghat)
ఇక్కడి అందమైన కొండలు, పొగమంచుతో కూడిన రోడ్లు మీకు మంచి అనుభూతిని ఇస్తాయి. అంతేకాకుండా లాంగ్ డ్రైవ్‌కి వెళ్లాలనుకునేవారికి ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ దొరుకుతుంది.
తంహిని ఘాట్ (Tamhini Ghat)
తంహిని ఘాట్ వర్షాకాలంలో పూర్తిగా పచ్చదనంతో నిండిపోతుంది. జలపాతాల అందాలు, అడవి దారులు, మల్షీ డ్యామ్, దేవ్కుండ జలపాతాలు ఇక్కడ ముఖ్య ఆకర్షణగా నిలుస్తున్నాయి. జల్లులు పడే సమయంలో పొగమంచుతో కూడిన అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి.
మహద్ (Mahad)
పచ్చదనంతో నిండి ఉంటే ఈ చారిత్రాత్మక పట్టణం.. రాయ్‌గడ్ కోటకు ప్రసిద్ధి చెందింది. వర్షాకాలంలో ఈ ప్లేస్‌కి వెళ్తే మీరు చుట్టూ ఉండే ప్రకృతి అందాలతో పాటు.. ఫోర్ట్‌లో టైమ్ స్పెండ్ చేయవచ్చు.
మాల్షెజ్ ఘాట్ (Malshej Ghat)
ఇది ముంబై లేదా పూణె నుంచి 120 నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మీకు ఎన్నో జలపాతాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ మీరు ఫ్లెమింగో బర్డ్స్ కూడా చూడవచ్చు. పింపళ్గావ్ జోగా డ్యామ్, శివనేరి కోటర, వాటర్‌ఫాల్స్ మీకు మంచి వ్యూలను అందిస్తాయి.
సతారా – కాస్ పీట (Kaas Plateau)
కాస్ పీటను మహారాష్ట్రలో 'వాలీ ఆఫ్ ఫ్లవర్స్' అని పిలుస్తారు. ఎందుకంటే జూలై చివరి నుంచి సెప్టెంబర్ మధ్య వరకు పువ్వులతో ఈ ప్రదేశం రంగుల పండుగలా మారుతుంది. తోషెఘర్ జలపాతాలు 200 మీటర్ల ఎత్తు నుంచి పడుతూ.. కళ్లకు ఆనందాన్ని ఇస్తాయి.
వీటితో పాటు కాలుష్యం లేని మాతెరన్కి, మహబలేశ్వర్ వంటి ప్రదేశాలకు కూడా వెళ్లొచ్చు. అయితే మీరు ఈ ప్రదేశాలకు వెళ్లేముందు అక్కడ పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకుని ప్రయాణం చేస్తే మంచిది. లేకుంటే జారిపోవడం, పొగమంచు ఎక్కువగా ఉంటే ఇబ్బంది ఎదుర్కోవచ్చు. అలాగే రెయిన్ జాకెట్స్, వాటర్ ప్రూఫ్ షూలు, స్నాక్స్ తీసుకువెళ్తే మంచిది. ట్రిప్ సమయంలో ఇబ్బంది కలుగకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా తీసుకెళ్తే మంచిది.