Watch Video: 


సంచలనం సృష్టించిన ఉజ్జెయిన్‌ బాలిక అత్యాచార కేసులో నిందితుడు భరత్ సోని (Bharat Soni) ఇంటిని కూల్చేశారు అధికారులు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుల్‌డోజర్‌తో ఇల్లుని ధ్వంసం చేశారు. ఇది అక్రమ నిర్మాణమని, అందుకే కూల్చివేశామని అధికారులు వెల్లడించారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చేశారన్న వాదనలు వినిపించాయి. అయితే..దీనిపైనా మున్సిపల్ కార్పొరేషన్ క్లారిటీ ఇచ్చింది. ఇది ప్రభుత్వం స్థలమని, అక్రమంగా ఇల్లు నిర్మించారని చెప్పింది. దీనికి నోటీసులతో పని లేదని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన అలజడి రేపింది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు తీవ్రంగా మండి పడ్డాయి. నడిరోడ్డుపై అత్యాచార బాధితురాలు సాయం కోసం అర్థిస్తున్న వీడియో అందరినీ షాక్‌కి గురి చేసింది.