Sanjay Raut Vs Shinde: 



శిందేపై రౌత్ అసహనం..


మహారాష్ట్ర రాజకీయాల్లో వేడి ఇంకా తగ్గలేదు. ఉద్దవ్ థాక్రే సేన, శిందే సేనకు మధ్య నిత్యం మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా...సంజయ్ రౌత్‌ (Sanjay Raut) అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి శిందేపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ సారి ఆ డోస్ పెంచి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నాథ్ శిందే హమాస్ ఉగ్రవాది (Hamas Terrorist) అని మండి పడ్డారు. ఉద్ధవ్ థాక్రే శివసేన హమాస్, లష్కరే తోయిబా లాంటి ఉగ్రసంస్థలతో చేతులు కలుపుతోందని శిందే చేసిన వ్యాఖ్యలపై ఇలా కౌంటర్ ఇచ్చారు సంజయ్ రౌత్. కేవలం తమ స్వార్థం కోసం ఉద్ధవ్ థాక్రే సేన ఉగ్ర సంస్థలతోనూ చేతులు కలపడంలో వెకనడాదంటూ మండి పడ్డారు శిందే. దీనిపై థాక్రే వర్గం భగ్గుమంది. అటు బీజేపీపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. 


"ఏక్‌నాథ్ షిందే ఓ హమాస్ ఉగ్రవాది. మేం ఉగ్ర సంస్థలతో చేతులు కలుపుతున్నామని చాలా దారుణమైన ఆరోపణలు చేశారు. బీజేపీ మీ (శిందేని ఉద్దేశిస్తూ) బుర్రలో ఎంత విషం నూరి పోసిందో ఈ వ్యాఖ్యలతోనే అర్థమైపోయింది"


- సంజయ్ రౌత్,థాక్రే సేన ఎంపీ 


ఏం జరిగిందంటే..? 


ఇటీవల ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో దసరా ర్యాలీ జరిగింది. ఆ సందర్భంలోనే ఏక్‌నాథ్ శిందే థాక్రే సేనపై ఫైర్ అయ్యారు. రాజకీయ లాభం కోసం ఉగ్రసంస్థలతోనూ చేతులు కలుపుతారంటూ మండి పడ్డారు. ఇందుకు ఓ కారణముంది. ఇటీవలే ఉద్ధవ్ థాక్రే సేన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రెండు పార్టీలనూ ఉగ్రసంస్థలతో పోల్చుతూ ఈ వ్యాఖ్యలు చేశారు శిందే. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీల పొత్తులు ఆసక్తికరంగా మారుతున్నాయి. I.N.D.I.A పేరుతో 26 పార్టీలు కలిసి విపక్ష కూటమిని ఏర్పాటు చేశాయి. అందులో భాగంగానే కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీతో కలిసి నడిచేందుకు అంగీకరించింది ఉద్ధవ్ థాక్రే శివసేన (UBT Shiv Sena). అయితే...2004 ఎన్నికల సమయంలో శివసేన, కాంగ్రెస్‌ పోటాపోటీగా విమర్శలు చేసుకున్నాయి. అప్పట్లో శివసేన నేత ఓ కాంగ్రెస్ నేత దిష్టిబొమ్మని తగలబెట్టడమే కాకుండా ఆ బొమ్మని చెప్పుతో కొట్టాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇలా ఎడ్డెం అంటే తెడ్డెం అనుకున్న పార్టీలు ఇప్పుడు ఎలా కలిసిపోయాయని శిందే ప్రశ్నిస్తున్నారు. 


ఇజ్రాయెల్‌ దాడులతో (Israel Hamas War) గాజా రక్తసిక్తమవుతోంది. గాజాలో వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. 16 రోజులుగా ఐడీఎఫ్ గాజాపై విరుచుకుపడుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గాజాలో దాడులు ఆపేయాలని, యుద్ధానికి విరామం ఇవ్వాలని యురోపియన్‌ యూనియన్‌ పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్‌-హమాస్‌లు యుద్ధానికి విరామం ఇవ్వాలని ఈయూ సూచించింది. కొద్ది రోజులు విరామం ఇస్తే గాజా ప్రజలకు మానవతా సాయం అందుతుందని, శరణార్థులకు ఆశ్రయం కల్పించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. 


Also Read: ‘పిల్లలను వ్యసనపరులను చేస్తోంది- మానసికంగా కుంగదీస్తోంది'- ఫేస్‌బుక్, ఇన్‌స్టాపై అమెరికా రాష్ట్రాల తిరుగుబాటు