Sanatan Dharma Row:



తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై (Sanatan Dharma) చేసిన వ్యాఖ్యలు దుమారం ఇంకా సద్దుమణగక ముందే..మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పిలవలేదన్న ఆయన...సనాతన ధర్మానికి ఇదే నిదర్శనమని అన్నారు. 


"కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించలేదు. సనాతన ధర్మం అంటే ఏంటో ఇంతకు మించి మంచి ఉదాహరణ ఇంకేముంటుంది..?"


- ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు మంత్రి