శనివారం ఉదయం పంజాబ్‌లోని నోయిడా నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు భూమి ఒక్కసారిగా కంపించింది. బలమైన ప్రకంపనలతో జనం ఒక్కసారిగా షేక్‌ అయ్యారు. ఆఫ్ఘనిస్తాన్-తజికిస్థాన్ సరిహద్దులో సంభవించిన భూకంపం ఫలితంగానే ఈ ప్రకంపనలు సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.


భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.7గా నమోదైంది. గత 24 గంటల్లో ఇది రెండో భూకంపం. ఉత్తరాఖండ్‌లో కూడా శనివారం తెల్లవారుజామున 3 గంటలకు 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది.







"పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం ఇది చాలా బలమైన భూకంపం. రిక్టర్ స్కేల్‌పై 7.3,గా నమోదైంది. " అని శ్రీనగర్ మేయర్ జునైద్ అజీమ్ మాట్ ట్వీట్ చేశారు.







ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కూడా భూకంపం యొక్క ప్రకంపనలకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.







భారత్‌లో వచ్చిన భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది.







జియో న్యూస్ చెప్పిన వివరాల ప్రకారం, ఇస్లామాబాద్, రావల్పిండి, పంజాబ్‌ సహా అనేక ఇతర నగరాల్లో శనివారం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్‌లోని నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ సెంటర్ ప్రకారం, భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో 210 కి.మీ లోతులో ఉంది. భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే భూకంపం కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.