5 PM Breaking Telugu News Today: 3 గంటల పాటు రాహుల్ గాంధీని విచారించిన ఈడీ, భారీ ధర పలికిన ఐపీఎల్ హక్కుల వేలం, తెలంగాణలోకి రుతుపవనాల ఎంట్రీ సహా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఉన్న టాప్ న్యూస్‌పై ఓసారి లుక్కేద్దాం.
3 గంటలు విచారణ
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దాదాపు 3 గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారించింది. ఉదయం 11.30కు మొదలైన విచారణలో రాహుల్ గాంధీపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక ఆరోగ్యశ్రీ పథకానికీ నగదు బదిలీ
వైద్య, ఆరోగ్య శాఖపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏ తరహా ప్రసవం జరిగినా తల్లికి రూ.5వేలు ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. సహజ ప్రసవం జరిగినా, సిజేరియన్ జరిగినా రూ.5వేలు ఇవ్వాలన్నారు. మరింత పారదర్శకంగా ఆరోగ్య శ్రీ పథకం అమలు చేయాలని.. నేరుగా లబ్ధిదారు ఖాతాలోకి డబ్బు, అక్కడ నుంచి ఆస్పత్రికి ఆటోడెబిట్లో చెల్లించాలని నిర్ణయించారు.
హైదరాబాద్‌లో కాంగ్రెస్ ర్యాలీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సహా అగ్రనేతలు పాల్గొన్నారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రజలకు కూల్ న్యూస్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి వచ్చేశాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం కాస్త చల్లబడింది. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా వరకు రుతుపవనాలు విస్తరించినట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఎండాలంలో వేడి, ఉక్కతో సతమతం అవుతూ అప్పుడప్పుడూ కురిసిన వర్షాలకు కాస్త సేద తీరిన ప్రజలకు ఇక పూర్తి చల్లని వాతావరణం పలకరించనుంది. ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రానికి మూడు రోజుల పాటు వర్ష సూచన ఉండనున్నట్లు అధికారులు ప్రకటించారు.
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. వరుస కాల్పులతో అమెరికా ఉలిక్కిపడుతోంది. చికాగో నగరంలో జరిగిన వివిధ కాల్పుల ఘటనల్లో మొత్తం ఐదుగురు మృతి చెందారు. 16 మందికి గాయాలయ్యాయి.
బీసీసీఐ మీద కనకవర్షం
2023 నుంచి 2027 సంవత్సరాలకు గానూ ఐపీఎల్ మీడియా రైట్స్ వేలం ముగిసింది. మొత్తంగా రూ.44,075 కోట్లకు టీవీ, డిజిటల్ హక్కులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. టీవీ హక్కులు ఒక బ్రాడ్‌కాస్టర్‌కు, డిజిటల్ హక్కులు మరో బ్రాడ్‌కాస్టర్‌కు దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. టీవీ రైట్స్‌ను సోనీ, డిజిటల్ హక్కులను వయాకాం18 దక్కించుకున్నాయని వార్తలు వస్తున్నాయి.