Mamata Banerjee On GI Tag: పశ్చిమ బెంగాల్‌కు చెందిన మూడు రకాల చేనేత చీరలకు జీఐ ట్యాగ్‌లు లభించాయి. ఈ సందర్భంగా హస్తకళాకారుల నైపుణ్యానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamta ) అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి చెందిన చీరలకు జీఐ ట్యాగులు రావడం గర్వకారణంగా ఉందని సోషల్ మీడియా ఎక్స్‌లో మమత పోస్ట్ చేశారు.


ఇండియాకు చెందిన అనేక రకాల ఉత్పత్తులు గతంలో జీఐ ట్యాగ్‌లను పొందాయి. బర్ధమాన్ రసగుల్లా, జాయ్‌నగర్ మోవా, సితాభోగ్, మిహిదానా వంటి ఆహార ఉత్పత్తులు జీఐ ట్యాగులు పొందిన వాటిలో ఉన్నాయి. చేనేత రకానికి చెందిన చీరలు శాంతిపురి, బాలుచారి, ధనియాఖలి వంటి అనేక ఉత్పత్తులు జీఐ ట్యాగులు పొందాయి. 


తాజాగా బెంగాల్‌కు చెందిన తంగైల్, కొరియల్, గరాడ్ చేనేత చీరలకు జీఐ ట్యాగులు దక్కాయి. దీంతో మమతా బెనర్జీ ట్వటర్‌లో హర్షం వ్యక్తం చేశారు. ‘పశ్చిమ బెంగాల్‌కు చెందిన మూడు చేనేత చీరలు తంగైల్, కొరియాల్, గరాడ్ జీఐ ఉత్పత్తులుగా గుర్తింపు పొందాయి. ఇది చేనేత కార్మికల నైపుణ్యాలకు ప్రతీక. కళాకారులకు అభినందనలు, వారి చూసి గర్విస్తున్నాం’ అంటూ మమతా బెనర్జీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.  






పశ్చిమ బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో చేనేత ప్రధాన వృత్తిగా ఉంది. ఆ రాష్ట్ర సాంస్కృతిక, వారసత్వం, సంప్రదాయ పనుల్లో ప్రధానమైనది. ఇప్పటికి చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది చేనేత పనులు చేస్తుంటారు. డైరెక్టరేట్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ప్రకారం బెంగాల్‌లో దాదాపు 3.5 లక్షల చేనేత పరిశ్రమలు ఉన్నాయి. 


జీఐ ట్యాగు పొందిన వాటిలో తంగైల్ చీరలు సైతం ఉన్నాయి. ఈ చీరలకు ఆ పేరు రావడం వెనుక పెద్ద స్టోరీనే ఉంది. బంగ్లాదేశ్‌లో తంగైల్ అనే జిల్లా ఉంది. విభజనకు ముందు తంగైల్ జిల్లా నుంచి బసక్ కమ్యూనిటీకి చెందిన చేనేతలు బెంగాల్‌కు వలస వచ్చారు. కత్వా ధాత్రిగ్రామ్, తమఘట, సముద్రగర్, పూర్బ బర్ధమ్మన్ జిల్లాలోని ప్రాంతాలలో స్థిరపడ్డారు. వారు తంగైల్ చీరలను నేసేవారు. ఈ క్రమంలో వాటికి ఆ పేరు వచ్చింది.


గతంలో ఈ చీరను బేగం బహార్ అని పిలిచేవారు. దీనిలో పట్టు, కాటన్,  ఉపయోగించేవారు. దీంతో ఇవి దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.  బొమ్మలతో కూడిన టాంగైల్ చీరల తయారీ జమ్దానీ చీరల మాదిరిగానే ఉంటుంది. అలాగే ముర్షిదాబాద్ జిల్లాలో గరడ్ సిల్క్ చీరను స్వచ్ఛమైన పట్టుతో అల్లుతారు. నదియా జిల్లాలోని శాంతిపూర్, ఫులియా, హుగ్లీ జిల్లాలోని ధనియాఖలి, బేగంపూర్, సముద్రగఢ్, ధాత్రిగ్రామ్, కత్వా, పుర్బా బర్ధమాన్ జిల్లాలోని కేతుగ్రామ్, బంకురా జిల్లాలోని బిష్ణుపూర్, బంకురా జిల్లాలోని బిష్ణుపూర్‌లో చేనేత మగ్గాలు ఎక్కువగా ఉన్నాయి.