ట్విట్టర్ హెడ్ క్వార్టర్ టెక్సాస్‌లోని విలియమ్సన్ కౌంటిలో ఉన్న తన గ్రామానికి మారిస్తే వద ఎకరాలు ఉచితంగా ఇస్తాని ఓ ఆసామి ఎలన్ మస్క్‌కు ఆఫర్ ఇచ్చారు. టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌లో పశువుల్ని పెంపకంతో పాటు కాపిటల్ ల్యాండ్ అండ్ లైవ్‌స్టాక్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్న జిమ్ ఈ ఆఫర్ చేశాడు.త ఆయనకు 20వేల ఎకరాల భూమి ఉంది. ట్విటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలమని..రైతు చెబుతున్నారు.
మరోవైపు రైతు ఇచ్చిన ఆఫర్‌కు ఇంకా ఎలన్ మస్క్ స్పందించలేదు. ఎలన్ మస్క్‌కు నచ్చితే ట్విటర్ ఆఫీస్‌ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు ఇట్టే మార్చేస్తారని అంటున్నారు. ఆయన నిర్ణయాలు అలాగే ఉంటాయని గుర్తు చేస్తున్నారు. పైగా ఎలన్ మస్క్‌కు చెందిన మూడు కంపెనీలు టెక్సాస్ రాష్ట్రంలోనే ఉన్నాయి. టెస్లా ప్రధాన కార్యాలయం ఆస్టిన్‌లో ఉంది. స్పేస్ ఎక్స్ బోకా చికా, దిబోరింగ్ కంపెనీ ప్లుగర్విల్లే నగరంలో ఉంది. ఈ మూడు ప్రాంతాలు టెక్సాస్ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ట్విటర్‌ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు మారిస్తే కార్యకాలపాలకు ఈజీగా ఉంటుందని చెబుతున్నారు.
ష‍్వెర్టనర్ ఆఫర్‌పై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ స్పందించారు. టెక్సాస్‌లో నివాసం ఉండే ష్వెర్ట్‌నర్ ట్విటర్‌ను తరలించేందుకు మస్క్‌కు 100 ఎకరాల ల్యాండ్‌ను ఉచితంగా అందిస్తారు. నేను ఫ్రీ స్పీచ్ జోన్‌గా ప్రకటిస్తా. ట్విటర్ కార్యాలయం షిప్ట్ అయితే ట్విటర్‌ను టెక్సాస్‌గా మార్చుకోవచ్చు. దీని గురించి ఆలోచించు ఎలన్ మస్క్ అంటే మస్క్ ట్విటర్‌కు ట్యాగ్ చేశారు.
వీళ్ల ఆఫర్లపై ఎలన్ మస్క్ స్పందించాల్సి ఉంది. ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేసినప్పటి నుండి... ట్విట్టర్ మొత్తం ఎలన్ మస్క్ విశేషాలే కనిపిస్తున్నాయి.