Swami Prasad Maurya: 



భారత్ హిందూ దేశం కాదు..


భారత్ హిందూ దేశమని, ఇక్కడ ఉండే వాళ్లందరూ హిందువులే అని RSS చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ (SP) నేత స్వామి ప్రసాద్ మౌర్య తీవ్రంగా స్పందించారు. భారత్ హిందూ దేశమే కాదని తేల్చి చెప్పారు. ఇది అందరి దేశమని, ఒక మతానికి ఆపాదించడమేంటని ప్రశ్నించారు. దేశ రాజ్యాగం లౌకికవాదం ఆధారంగానే రూపొందిందని వెల్లడించారు. 


"భారత్ ఎప్పటికీ హిందూ దేశం కాదు. ఇక్కడ నివసించే అందరిది. లౌకిక వాదం ఆధారంగానే మన దేశ రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ దేశంలో ఉండే వాళ్లందరూ భారతీయులే. అన్ని మతాలు, విశ్వాసాలు, సంస్కృతులు, వర్గాలకు రాజ్యాంగం ప్రత్యేక ప్రాతినిధ్యం ఇచ్చింది. కేవలం హిందువులకు మాత్రమే ఆపాదించడం సరికాదు"


- స్వామి ప్రసాద్ మౌర్య, ఎస్‌పీ నేత