Aditya-L1 Solar Mission:
ప్రయోగం విజయవంతం..
భారత్ తొలిసారి చేపట్టిన సోలార్ మిషన్ Aditya L1. శ్రీహరికోట నుంచి PSLV ద్వారా దీన్ని లాంఛ్ చేసింది ఇండియా. సూర్యుడిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడమే ఈ మిషన్ లక్ష్యం. లగ్రాంజ్ పాయింట్ (Lagrange Point 1) నుంచి సూర్యుడి చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. అయితే...అనుకున్న ట్రాజెక్టరీలో ఆదిత్య L1 వెళ్లడం అంత సులువైన విషయం కాదు. చంద్రయాన్ 3 లో సాఫ్ట్‌ల్యాండింగ్ ఎంత కష్టం అనుకున్నారో...అదే స్థాయిలో ఆదిత్యను ట్రాజెక్టరీలోకి వెళ్లడమూ సవాలే. దశల వారీగా లగ్రాంజ్ పాయింట్ 1 కి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ పాథ్ స్ట్రెయిట్‌గా ఉండదు. ఎన్నో మలుపులు దాటుకుని అక్కడికి చేరుకోవాలి. ముందుగా Low Earth ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. దీన్నే Earth-Centred Orbit Transferగా పిలుస్తారు. ఆదిత్య L1 మూడు సార్లు భూకక్ష్యలోనే తిరుగుతుంది. ఈ ట్రాజెక్టరీ Elliptical షేప్‌లోకి వచ్చేంత వరకూ ఇలాగే ప్రదక్షిణలు చేస్తుంది. ఇందుకు భిన్నంగా కక్ష్య వృత్తాకారంలోకి వచ్చేంత వరకూ తిరిగింది చంద్రయాన్ 3. భూమి గురుత్వాకర్షణను ఉపయోగించుకునే ఈ ప్రదక్షిణలు చేస్తుంది. మూడు సార్లు ఈ Manoeuvres పూర్తైన తరవాత ఆదిత్య L1 భూ కక్ష్యను వీడిపోతుంది. Sphere of Influence (SOI)ని దాటుతుంది. అక్కడి నుంచి సూర్యుడి L1 లేయర్‌వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. ఈ దశనే క్రూజ్ ఫేజ్‌గా (Cruise Phase) పిలుస్తారు. ఎప్పుడైతే భూ గురుత్వాకర్షణ నుంచి ఆదిత్య L1 వెళ్లిపోతుందే...అక్కడి నుంచి సూర్యుడి గురుత్వాకర్షణ శక్తికి లోనవుతుంది. అందుకే...ఈ ఫేజ్ చాలా కీలకం అంటున్నారు శాస్త్రవేత్తలు.
L1 కి చేరుకున్నాక..?
ఒక్కసారి L1 ఫేజ్‌కి చేరుకున్న తరవాత ఆదిత్య L1 ఇంజిన్‌ల సాయంతో పాథ్ మార్చుతారు. అక్కడి నుంచి క్రమంగా L1 Halo Orbitలోకి ప్రవేశిస్తుంది. ఆ పాయింట్ వద్దే ఇది స్టేబుల్‌గా ఉంటుంది. సరిగ్గా ఈ పాయింట్ వద్ద భూమి గురుత్వాకర్షణ శక్తి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి బ్యాలెన్స్ అవడం వల్ల ఆదిత్య L1 అక్కడే స్థిరంగా ఉంటుంది. అయితే...సైంటిస్ట్‌లు చెబుతున్న వివరాల ప్రకారం...అది అక్కడ స్టేబుల్‌గా ఉండకుండా చాలా నెమ్మదిగా కదులుతుంది. అక్కడి నుంచే సూర్యుడికి సంబంధించిన కీలక వివరాలు సేకరిస్తుంది. రోజుకి 14 వందలకు పైగా ఫొటోలు తీసి పంపుతుంది. లగ్రాంజియన్ పాయింట్‌కి చేరుకున్న తరవాత Visible Emission Line Coronagraph (VELC) సాయంతో అక్కడి నుంచి ఫొటోలు పంపనుంది ఆదిత్య L1. రోజుకి 1,440 ఫొటోలు పంపుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ ఫొటోల ద్వారా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. ఆదిత్య L1లో అతి పెద్ద పే లోడ్ VELC. ఈ మిషన్ మొత్తంలో ఇదే అత్యంత కీలకం. Indian Institute of Astrophysics ఇస్రోతో కలిసి ఈ పేలోడ్‌ని తయారు చేసింది. ఇప్పటికే చంద్రయాన్ 3 సక్సెస్‌తో జోష్ మీదున్న ఇస్రో...ఈ ప్రయోగం కూడా విజయవంతం అవుతుందన్న ధీమాతో ఉంది.
Also Read: ఆదిత్య L1 మోసుకెళ్లే పేలోడ్స్ ఎన్ని? అవి అధ్యయనం చేసే అంశాలేంటీ?