Aditya L1 Launch : ఇస్రో ఆదిత్య L1 ప్రయోగం చేస్తున్న ఈ టైమ్‌లో ప్రపంచం మరోసారి భారత్ వైపు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ తర్వాత భారత్ చేపడుతున్న ప్రయోగం కావటం ఓ కారణమైతే...కేవలం 400 కోట్ల రూపాయల ఖర్చుతో ఆదిత్య L1ను 15లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్ 1 కు  ఇస్రో పంపిస్తుండటం మరో ఆసక్తికర అంశం. నాలుగు నెలలు పాటు స్పేస్‌లో ప్రయాణించి L1 ను చేరుకోనున్న ఈ స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడిపై నిరంతం పరిశోధనలు చేస్తూ ఇస్రోకు విలువైన సమాచారం అందించనుంది. అసలు ఏయే దేశాలు ఇప్పటి వరకూ సూర్యుడి మీద ప్రయోగాలు చేశాయి. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ మిషన్స్ ఏంటో తెలుసుకుందాం. 


ఇప్పుడు ఆదిత్య L1 ప్రయోగం ద్వారా సూర్యుడే లక్ష్యంగా స్పేస్ క్రాఫ్ట్ ను పంపిస్తున్న ఆరో దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటి వరకూ అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ స్పేస్ ఏజెన్సీ, జర్మనీ, చైనా మాత్రమే సూర్యుడు లక్ష్యంగా స్పేస్ క్రాఫ్ట్స్ ప్రయోగించాయి. జపాన్, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లు నాసా సహకారంతో ఈ ప్రయోగాలు చేశాయి. ఇప్పటివరకూ మొత్తం 22 స్పేస్ క్రాఫ్ట్ లను సూర్యుడే లక్ష్యంగా ప్రయోగించారు. 


అమెరికా :
మొట్టమొదటి సారి 1960-69 మధ్య కాలంలో నాసా పయొనీర్ పేరుతో ఆరు ఆర్బిటర్‌లను సూర్యుడి మీద ప్రయోగాలకు లాంఛ్ చేసింది. వీటిలో ఐదు సక్సెస్ కాగా ఒకటి ఫెయిల్ అయ్యింది. అయితే ఇవి హీలియో సెంట్రిక్ ఆర్బిట్ లక్ష్యంగానే పంపినా వీనస్ మీద ప్రయోగాల కోసం చేపట్టినవి తప్ప పూర్తిగా సూర్యుడే లక్ష్యం కాదు. ఆ తర్వాత జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ లతో కలిసి సూర్యుడి ప్రయోగాలు చేసిన నాసా సోలార్ మిషన్స్ లో కీలకమైంది పార్కర్ ప్రోబ్.2018లో నాసా ప్రయోగించిన పార్కర్ ప్రోబ్ కు ఓ ప్రత్యేకత ఉంది. సూర్యుడిని టచ్ చేసిన తొలి, ఏకైక ఉపగ్రహం ఇదొక్కటే. సూర్యుడి అవుటర్ మోస్ట్ అట్మాస్పియర్ స్టడీ చేయటమే లక్ష్యంగా నాసా ప్రయోగించిన ఈ స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడికి సంబంధించిన ప్లాస్మా, కొరోనాను అద్భుతంగా ఫోటోలు తీసింది. 2025 వరకూ ఇది పనిచేస్తుందని నాసా భావిస్తోంది.




జపాన్ :
 జపాన్ ఇప్పటివరకూ ఐదుసార్లు సూర్యుడు లక్ష్యంగా స్పేస్ క్రాఫ్ట్ లను ప్రయోగించింది. 1981లో హింటోరి పేరుతో జపాన్ తొలిసారి సూర్యుడి పై పరిశోధనలకు స్పేస్ క్రాఫ్ట్ ను పంపించగా..చివరిసారి 2006లో హీనోడ్ పేరుతో సోలార్ అబ్జర్వేటరీ ని ప్రయోగించింది.



యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ :
  1990లో తొలిసారిగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సూర్యుడి ధృవాల పైన పరిశోధనల కోసం యులిసెస్ పేరుతో స్పేస్ క్రాప్ట్ ను ప్రయోగించింది. 2001లో నాసా, జపాన్ తో కలిసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా 2 పేరుతో చేసిన ప్రయోగం కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. 


ఈ దేశాలు కాకుండా జర్మనీ కూడా సోలార్ మిషన్స్ లో పాల్గొంది. కానీ చేసినవన్నీ నాసా కొలాబరేషన్ తోనే చేసింది.



చివరగా సూర్యుడి మీద ప్రయోగాలు చేసిన దేశమంటే చైనా పేరు చెప్పాలి. 2022 లో అసోస్ పేరుతో చైనా ప్రయోగించిన అడ్వాన్స్డ్ స్పేస్ బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీ సూర్యుడిపై నిరంతం పరిశోధనలు చేస్తోంది.


 ఇప్పటివరకూ 22 సూర్య ప్రయోగాల్లో అత్యంత ఖరీదైనది నాసా 2018లో చేసిన పార్కర్ ప్రోబ్ ప్రయోగం. దానికి ఏకంగా 12వేల కోట్ల రూపాయలు ఖర్చు కాగా...ఇప్పుడు ఇస్రో చేస్తున్న ఆదిత్య L1 ప్రయోగానికి పెడుతున్న 400 కోట్ల రూపాయలే అత్యంత చౌకైన సూర్యప్రయోగం