Aditya L1 Mission Launch : సూర్యుడే లక్ష్యంగా మనుషులు ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారు. ఇస్రో కూడా ఆదిత్య L1 ప్రయోగం చేస్తుంది కాబట్టి దీని స్పెషాలిటీ ఏంటీ. ఇస్రో ఎందుకు ఇంత ప్రతిష్ఠాత్మకంగా ఆదిత్య L1 ను భావిస్తుంది. ఈ ప్రయోగం వల్ల ISRO శాస్త్రవేత్తలు ఎలాంటి విషయాలు తెలుసుకోనున్నారు అనే అంశాలు చూద్దాం.


ఈ ఆదిత్య L1 అనేది ఇప్పటి కాదు 2008 నుంచి మన శాస్త్రవేత్తలు కష్టపడుతుంటే ఇన్నేళ్లకూ దాన్ని ప్రయోగించే దశకు తీసుకురాగలిగాం. ఆదిత్య అంటే తెలుసుగా సంస్కృతంలో సూర్యుడు అని అర్థం. మరి L1 అంటే లంగ్రాజ్ పాయింట్ వన్. ఈ లంగ్రాజ్ పాయింట్స్ ఎందుకు అక్కడికే పంపించి ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారనేది నెక్ట్స్ వీడియోలో తెలుసుకుందాం..ఈ వీడియోలో ఆదిత్య L1 ఎలా తయారు చేశారు. అందులో ఉన్న పేలోడ్స్ గురించి మాట్లాడుకుందాం.


ఆదిత్య L1 కంప్లీట్ గా ఇస్రోనే దాని విభాగ సంస్థలే తయారు చేసిన ఇండిజినస్ స్పేస్ క్రాఫ్ట్. మొదట్లో దీన్ని చాలా చిన్నగా చేద్దామనుకుని ఇయర్ గా 3కోట్ల రూపాయల చొప్పున బడ్జెట్ కేటాయించారు కానీ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని స్పాన్ పెరిగింది. చేసేది పెద్దగా చేయాలన్న ఉద్దేశంతో లంగ్రాజ్ పాయింట్ కు ప్రయోగాలు చేద్దామని బడ్జెట్ పెంచారు. మొత్తంగా 378 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ ప్రాజెక్ట్. లాంఛింగ్ కాస్ట్ కూడా ఇందులోనే ఉంది. వాస్తవానికి ప్రపంచంలోని వేరే దేశాల స్పేస్ ఏజెన్సీలతో పోలిస్తే ఇండియా ఈ ప్రయోగానికి పెడుతున్న కాస్ట్ చాలా అంటే చాలా తక్కువ. మన RRR సినిమా తీసిన సగం బడ్జెట్ లో సూర్యుడి మీదకు స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగిస్తున్నామంటే అర్థం చేసుకోండి ఎంత తక్కువ ఖర్చో. 


లగ్రాంజ్ పాయింట్ వన్ భూమి నుంచి 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పాయింట్ లో సరిగ్గా ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమికి, సూర్యుడికి సమాన దూరంలో ఉంటుంది. ఎలాంటి గ్రహణాలు ఉండవు కాబట్టి నేరుగా సూర్యుడి చూస్తూ పరిశోధనలు చేస్తుంది ఆదిత్య L1.ఈ ఉపగ్రహం మొత్తం బరువు 1500 కిలోలు. ఇండియా సూర్యుడు టార్గెట్ గా చేస్తున్న తొలి ప్రయోగం ఇది. సెప్టెంబర్ 2 ఉదయం 11 గంటల 50నిమిషాలకు శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఆదిత్య L1 ప్రయోగం జరుగుతుంది.


మరి ఈ ఉపగ్రహంలో ఉండే ఇన్ట్రుమెంట్స్ ఏంటీ అవి చేసే శాస్త్రీయ పరిశోధనలు ఏంటీ..?


ఆదిత్య L1 లో మొత్తం ఏడు పేలోడ్స్ వెళ్తున్నాయి


1. విజిబుల్‌ ఎమిజన్ లైన్‌ కొరొనాగ్రాఫ్‌(Visible Emission Line Coronagraph) (VELC)
సూర్యుడి అవుటర్ మోస్ట్ పార్ట్ ని కొరోనా అంటారు. ఈ కొరోనా సూర్యుడివెలుగులో మనకు అస్సలు కనిపించదు. ఏవైనా స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ తోనే చూడాల్సి ఉంటుంది. సో ఆదిత్య L1 లో 170 కిలోల బరువు ఉండే ఈ VELC ఇన్స్ట్రుమెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్ పెరిమెంట్ చేస్తుంది అదేంటంటే...సూర్యగ్రహణాన్ని ఆర్టిఫీషియల్ గా సృష్టిస్తుంది. సూర్యుడికి మొత్తం ఎదురుగా వెళ్లటం ద్వారా నీడను సృష్టించి కొరోనోగ్రాఫ్ ను తయారు చేస్తుంది. అంటే సూర్యుడు నిరంతం మండుతూ ఉంటాడు కదా. ఇలా ఎప్పుడూ కూడా సూర్యుడి నుంచి మాస్ ఎజెక్షన్స్ అవుతూ ఉంటాయి. సో అవి ఎలా వస్తున్నాయి ఏంటీ లాంటివి మ్యాపింగ్ చేయటంతో పాటు సూర్యుడి మాగ్నటిక్ ఫీల్డ్ మీద కూడా ఓ అంచనాకు వచ్చేందుకు అవకాశం లభిస్తుంది.



2. సోలార్‌ ఆల్రావైలెట్‌ ఇమేజింగ్‌ టెలీస్కోప్‌ - Solar Ultraviolet Imaging Telescope (SUIT)
 దీన్నే సూట్ పేలోడ్ అంటున్నారు. ఇది 35 కిలోల బరువు మాత్రమే ఉండే ఓ చిన్న టెలిస్కోప్. ఇది సూర్యుడిని 200-400 నానో మీటర్ వేవ్ లెంత్ రేంజ్ నుంచి గమనిస్తుంది.11 వేర్వేరు ఫిల్టర్లను వాడుతూ సూర్యుడి డిఫరెంట్ లేయర్స్ ను ఫోటోలు తీస్తుంది. ఇంత తక్కువ వేవ్ లెంత్ రేంజ్ లో సూర్యుడిని ఫోటోలు తీసిన టెలిస్కోప్ మరొకటి లేనే లేదు.


3. ఆదిత్య సోలార్‌ విండ్ పార్టికల్‌ ఎక్స్‌పర్మెంట్‌ Aditya Solar wind Particle Experiment (ASPEX)
 ఆస్పెక్స్ గా పిలుస్తున్న ఈ ఇన్ స్ట్రుమెంట్ సూర్యుడి నుంచి వస్తున్న అతి తీవ్రమైన గాలులను, ఆ స్ప్రైక్ట్రల్ క్యారెక్టరస్టిక్స్ ను స్టడీ చేస్తుంది.



4. ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్ ఆదిత్య Plasma Analyser Package for Aditya (PAPA)
   ఇదిగో ఇలా లావాలా ఉబుకుతుందే దీన్నే ప్లాస్మా అంటారు. సూర్యుడి మీద అనేక గ్యాసెస్ ఉంటాయి అవన్నీ కలిసి ఇలా ప్లాస్మా రూపంలో ఉంటాయి. చూడటానికి ఇది కూడా గ్యాస్ స్టేట్ లోనే కనిపిస్తున్నా చాలా పార్టికల్స్ అయనైజ్డ్ అయిపోయి ఉంటాయి. సో ఈ ప్లాస్మా ఎలా ఫార్మ్ అవుతుంది ఏంటీ అనేది పాపా ఇన్ స్ట్రుమెంట్ కంప్లీట్ విశ్లేషిస్తుంది.



5. సోలార్‌ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్- Solar Low Energy X-ray Spectrometer (SoLEXS)
  సూర్యుడి నుంచి మనకు కనిపించే విజుబుల్ లైట్ కాకుండా కాంతి ఎక్స్ రే ల రూపంలో, ఇన్ ఫ్రారెడ్ కిరాణాల రూపంలో, ఆల్ట్రా వైలెట్ రేస్ రూపంలో వస్తూ ఉంటుంది. సో సూర్యుడి ఉపరితలం కాకుండా కొరోనా అంటే అవుటర్ మోస్ట్ అట్మాస్పియర్ నుంచి నుంచి వచ్చే లోఎనర్జీ ఎక్స్ రే స్ ను అనలైజ్ చేసే బాధ్యత ఈ సోలెక్స్ ఇన్ స్ట్రుమెంట్ ది.



6.హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్- High Energy L1 Orbiting X-ray Spectrometer (HEL1OS)
 సూర్యుడు ఒక్కోసారి ఉన్నట్టుండి వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సూర్యుడి మీద ఏర్పడే తుపాన్లు విశ్వానికి ప్రమాదం అని శాస్త్రవేత్తలో ఓ ఆందోళన. అందుకే సూర్యుడి కొరోనాలో జరుగుతున్న మార్పులు, ఆ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుందో తెలుసుకోవటం అవసరం. అందుకే ఈ ఇన్స్ట్రుమెంట్ .



7.మాగ్నెటోమీటర్-Magnetometer
 భూమికి ఉన్నట్లే సూర్యుడికి అతిపెద్ద అయస్కాంత క్షేత్రం ఉంటుంది. సౌర కుటుంబంలో ఇన్ని గ్రహాలను, వాటి చందమామలను తన చుట్టూ తిప్పుకోగలుగుతున్న ఆ అతి పెద్ద అయస్కాంత క్షేత్రం లక్ష్యంగా పరిశోధనలు చేయటం ఈ మాగ్నటో మీటర్ పని.



సో ఇలా ఈ ఏడు పరికరాలు ఏడు వేర్వేరు పనులు చేస్తూ సూర్యుడిని నిరంతం మానిటర్ చేస్తూ విలువైన డేటాను ఇస్రోకు పంపించనున్నాయి. ఫలితంగా సూర్యుడిని ఇంకా బెటర్ గా అర్థం చేసుకునేందుకు...ఉపద్రవాల నుంచి భూమిని ముందుగా జాగ్రత్తగా కాపాడునేందుకు ఆదిత్య L1 ప్రయోగం ఉపయోగపడనుంది.