Delhi CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు (Delhi CM Kejriwal) మరోసారి షాక్ తగిలింది. ఆయన బెయిల్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట దక్కలేదు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ట్రయల్ కోర్టు తనకు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే (Delhi High Court) విధించడంపై ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 26న విచారించనున్నట్లు వెల్లడించింది. హైకోర్టు ఆదేశాలు వచ్చే వరకూ వేచి చూడాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆయనకు మళ్లీ నిరాశే ఎదురైంది.














కేజ్రీవాల్‌ బెయిల్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై.. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. విచారణ తొలి రోజే బెయిల్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇవ్వాల్సిన అవసరం ఏముందని.. హైకోర్టు తన ఉత్తర్వులు వచ్చేంతవరకూ సీఎం ఎందుకు స్వేచ్ఛగా ఉండకూడదని అన్నారు. కేజ్రీవాల్‌కు అనుకూలంగా బెయిల్ ఉత్తర్వులు ఉన్నాయని.. ఆయన విదేశాలకు పారిపోయే ప్రమాదం కూడా లేదని పేర్కొన్నారు. అయితే, కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈ నెల 26న విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.


ఇదీ జరిగింది


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీఎం కేజ్రీవాల్‌కు ఈ నెల 20న రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఈడీ.. హైకోర్టులో సవాల్ సవాల్ చేసింది. దీనిపై విచారించిన జస్టిస్ సుధీర్ కుమార్ జైన్, జస్టిస్ రవీందర్ దుడేజాతో కూడిన ధర్మాసనం ట్రయల్ కోర్టు నిర్ణయంపై స్టే విధించింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. అక్కడా ఆయనకు నిరాశే ఎదురైంది.


Also Read: Loksabha Session: లోక్ సభ సమావేశాలు ప్రారంభం - ఎంపీగా ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం