Supreme Court:  సుప్రీం కోర్టు (Supreme Court) న్యాయమూర్తి ఎంఆర్ షా (MR Shah) (64)కు గుండెపోటు వచ్చింది. దీంతో హుటాహుటిన ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎయిర్‌ అంబులెన్స్‌లో దిల్లీ (Delhi) ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని సుప్రీం(Supreme Court) కోర్టు న్యాయవాది, భాజపా అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ట్వీట్ ద్వారా తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు గౌరవ్ భాటియా.






మెరుగైన వైద్యం


జస్టిస్ ఎంఆర్ షా గురువారం గుండెకు సంబంధించిన ఇబ్బందిని ఎదుర్కొన్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి కూడా మీడియాకు తెలిపారు. ఈ విషయం తెలిసిన సుప్రీంకోర్టు అధికారులు కూడా జస్టిస్ ఎంఆర్ షాకు మెరుగైన వైద్యం కోసం హోంమంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడారు.


ఎంఆర్ షా గతంలో పట్నా హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా  పనిచేశారు. 2023లో ఆయన పదవీ విరమణ పొందనున్నారు.


ఏం ఫర్లేదు






తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని జస్టిస్ ఎంఆర్ షా పేర్కొన్నట్లు ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది. త్వరలోనే విధుల్లోకి వస్తానని, కోలుకుంటున్నానని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.


Also Read: President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల రేసులో లాలూ- నామినేషన్ కూడా దాఖలు!


Also Read: Presidential Poll 2022: ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో, లిస్ట్‌లో చాలా మందే ఉన్నారుగా