President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. అయితే నోటిఫికేషన్ విడుదలైన తొలి రోజే 11 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. అయితే ఇందులో ఓ నామినేషన్‌ను తిరస్కరించారు. సరైన పత్రాలు లేకపోవడంతో ఈ నామినేషన్‌ను తిరస్కరించారు.
లాలూ పోటీ!
నామినేషన్ దాఖలు చేసిన వారిలో బిహార్ సరన్‌కు చెందిన లాలూ ప్రసాద్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నారని పార్లమెంటరీ వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో దిల్లీ, మహారాష్ట్ర, బిహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని సమాచారం.
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని నిర్ణీత ఫార్మాట్‌లో నింపి, ఎలక్టోరల్ సభ్యుల్లో 50 మంది ప్రతిపాదించాలి. మరో 50 మంది ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. అలాగే రూ.15 వేలు డిపాజిట్ చేయాలి.
విపక్షాల అభ్యర్థి
ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్‌ను నిలబెట్టాలని ప్రతిపాదించారని, అయితే ఆయన ఆరోగ్య సమస్యల రీత్యా ఆలోచించాల్సి వస్తోందని అన్నారు సీపీఐ నేత బినోయ్ విశ్వం. అయితే ప్రతిపక్షాలు మాత్రం కచ్చితంగా శరద్ పవార్‌నే అభ్యర్థిగా ప్రకటించాలని పట్టు పడుతున్నట్టు సమాచారం. భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రధాని మోదీ భంగం కలిగిస్తున్నారని, ఆయనను అడ్డుకోవాలంటే
బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్నామని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఫరూక్ అబ్దుల్లాతో పాటు గాంధీ మనవడు గోపాల కృష్ణ గాంధీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మమతా బెనర్జీ వీరిద్దరి పేర్లనూ ప్రతిపాదించినట్టు సమాచారం.
కీలక తేదీలు
- ఎన్నికల నోటిఫికేషన్: జూన్ 15
- నామినేషన్లకు చివరి రోజు: జూన్ 29
- నామినేషన్ల పరిశీలన: జూన్ 30
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు: జులై 2
- పోలింగ్: జులై 18
- కౌంటింగ్, ఫలితాలు: జులై 21
- ప్రమాణస్వీకారం: జులై 25
ఎన్నిక ఇలా
రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకోనుంది. ఎలక్టోరల్ కాలేజ్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. ఎలక్టోరల్ కాలేజ్‌లో 4809 మంది సభ్యులు ఉన్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఇందులో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కో ఎంపీ ఓటు విలువ 700 అని కమిషనర్ వెల్లడించారు. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల విలువ 10,98,903గా పేర్కొన్నారు. 5,34, 680 ఓట్ల విలువ పొందిన అభ్యర్థి విజయం సాధిస్తారని ఈసీ తెలిపింది.
Also Read: Presidential Poll 2022: ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో, లిస్ట్‌లో చాలా మందే ఉన్నారుగా
Also Read: Maharashtra: భలే ఛాన్సులే, లలల లలల లక్కీ ఛాన్సులే- ఆ ATMలో రూ.500 కొడితే రూ.2,500 విత్‌డ్రా!