Super Moon In August 2023: భారత్‌లో మంగళవారం నిండైన చందమామ రూపం కనువిందు చేసింది. సాధారణం కన్నా పెద్దగా చంద్రుడు కనిపించాడు. జాబిల్లి భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఇలాంటి అరుదైన ఘటన జరుగుతుంది. దీనిని స్టర్జన్ మూన్‌గా పిలుస్తారు. ఈ స్టర్జన్ మూన్, ఆగష్టు 1న కుంభరాశిలో ఉదయించింది. ఈ నెల 30న మరోసారి సూపర్ మూన్ చూడొచ్చు. దీనికి డవ పౌర్ణమికి బ్లూ మూన్ అని పేరు పెట్టారు. ఆగస్టు 1న మధ్యాహ్నం 2:32 నుంచి సూపర్‌మూన్‌ ప్రారంభమైంది. ఆగస్ట్ 2న ఉదయం 12:02 గంటలకు సూపర్‌మూన్ గరిష్ట స్థాయికి చేరుకుంది. భారతదేశంలో వాతావరణం, ఆకాశంలో మేఘాలను బట్టి ప్రజలు సూపర్‌మూన్‌ను చూసే అవకాశం వచ్చింది.


2018లో ఇలా ఒకేనెలలో రెండుసార్లు సూపర్‌మూన్‌ కనిపించింది. తిరిగి 2037లో ఇలా జరగనుంది. సూపర్‌మూన్‌ నాడు చందమామ సాధారణం కన్నా 7 శాతం పెద్దగా, 16 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ నెలలోనే ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోందని, ఈనెల 1న సూపర్‌మూన్ రాగా, ఈనెల 30న బ్లూ మూన్‌ ఆకట్టుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  నుంది. ఈ రెండు ఒకే నెలలో రావడం మరో అద్భుతమన్నారు. 2018లో ఇలాగే జరిగిందని గుర్తు చేశారు.


ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కైవాచర్‌లకు ఆగస్టు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ నెలలో ప్రజలు రెండు సూపర్‌మూన్‌లను చూస్తారు. ఇది సాధారణం కంటే భూమికి దగ్గరగా ఉంటుంది. సాధారణంగా చంద్రుడు భూమికి 222,159 మైళ్లు (357,530 కిలోమీటర్లు) దూరంలో ఉంటాడు. ఆగష్టు 30న, దూరం 222,043 మైళ్లు (357,344 కిలోమీటర్లు) దగ్గర ఉంటుంది. ఆగస్టు 30న వచ్చే సూపర్‌మూన్‌ను బ్లూ మూన్‌ అంటారు.


వేర్వేరు సంప్రదాయాలు.. వేర్వేరు పేర్లు
1930లలో మైనే ఫార్మర్స్ పంచాంగం పౌర్ణమికి "భారతీయ" పేర్లను ప్రచురించడం ప్రారంభించింది. తరువాత ఈ పేర్లు విస్తృతంగా ప్రసిద్ధి చెందాయి. ఈ పంచాంగం ప్రకారం మంగళవారం ఏర్పడిన పౌర్ణమిని ఈశాన్య USAలో ఉన్న అల్గోన్‌క్విన్ తెగలు స్టర్జన్ మూన్ అని పిలుస్తారు. ఇలా జరిగినప్పుడు పెద్ద చెరువులు, నీటి వనరులలో ఏడాది అంతా పెద్ద చేపలు దొరుకుతాయని వారు విశ్వసిస్తారు. ఈ సూపర్‌మూన్‌కు  రెడ్ మూన్, కార్న్ , గ్రీన్ కార్న్ మూన్, బార్లీ మూన్, హెర్బ్ మూన్, గ్రెయిన్ మూన్ డాగ్ మూన్ అనే పేర్లు ఉన్నాయి. 


శ్రీలంకలో ప్రత్యేకం
శ్రీలంకలో ప్రతి పౌర్ణమి సెలవుదినం. 2023లో రెండు ఎసల పోయ సెలవులు ఉన్నాయి. జూలై 3న వచ్చిన పౌర్ణమిని ఆది ఎసల పోయ,  అని మంగళవారం వచ్చిన  పౌర్ణమి, ఎసల పోయగా పిలుచుకుంటారు. ఈ సందర్భంగా వారు బుద్ధుని మొదటి ఉపన్యాసాన్ని స్మరించుకుంటాయి. ఈ పౌర్ణమితో బౌద్ధ సన్యాసులు వాస్సాను ప్రారంభిస్తారు. అనేక సాంప్రదాయ క్యాలెండర్లలో పౌర్ణమి నెలల మధ్యలో లేదా సమీపంలో వస్తుంది. ఈ పౌర్ణమి చైనీస్ క్యాలెండర్‌లో ఆరవ నెలలో, హిబ్రూ క్యాలెండర్‌లో అవ్, ఇస్లామిక్ క్యాలెండర్‌లో ముహర్రం మధ్యలో ఉంటుంది. ముహర్రం ఇస్లామిక్ సంవత్సరంలో మొదటి నెల, యుద్ధం నిషేధించబడిన నాలుగు పవిత్ర మాసాలలో ఒకటి.