CWC Meeting:
పార్టీ వేదికలపై ఆత్మవిమర్శ జరగాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సూచించారు. ఆత్మవిమర్శ అనేది ఆత్మవిశ్వాసం, నైతికత దెబ్బతిసేలా ఉండకూడదన్నారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
మేథోమధనం
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మే 13 - 15 మధ్య కాంగ్రెస్ పార్టీ మేథోమధన సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో 400 మంది కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొంటారు. భాగస్వాముల్లో అత్యధికులు పార్టీలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదవులు నిర్వహిస్తున్న లేదా గతంలో నిర్వహించినవారు ఉంటారు. అంతేకాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నవారు కూడా సమావేశానికి వస్తారు.
కసరత్తు
ఈ సదస్సు విధివిధానాలు, అజెండాపై సోమవారం దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేతలు రాహుల్ గాంధీతోపాటు సీడబ్ల్యూసీ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి సోనియా గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్టీని మళ్లీ గెలుపు బాట పట్టించేలా నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సోనియా గాంధీ అన్నారు. పార్టీ నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్క నాయకుడు తిరిగి రుణం తీర్చుకోవాలని సోనియా పిలుపునిచ్చారు.
Also Read: Sedition Law: రాజద్రోహం చట్టంపై కేంద్రం యూటర్న్- సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు!
Also Read: Vladimir Putin: 'మా జోలికొస్తే తరిమికొడతాం'- విక్టరీ డే పరేడ్‌లో పుతిన్ వార్నింగ్