జల్లికట్టుని రక్షిస్తేనే, సనాతన ధర్మం నిలబడుతుంది - బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

MP Tejasvi Surya: సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే జల్లికట్టుని కాపాడుకోవాలని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు.

Continues below advertisement

 MP Tejasvi Surya on Sanatan Dharma: 

Continues below advertisement


బెంగళూరులో కంబాళ..

బెంగళూరు సౌత్ ఎంపీ, బీజేపీ యువ మోర్చ ప్రెసిడెంట్ తేజస్వీ సూర్య (Tejasvi Surya) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలన్నీ కలిసి సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) కాపాడాలని సూచించారు. కొంతమంది సంప్రదాయ క్రీడలైన జల్లికట్టు (Jallikattu), కంబాళను (Kambala) అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని మండి పడ్డారు. ఈ క్రీడల్ని కాపాడుకుంటే సనాతన ధర్మాన్ని కాపాడుకున్నట్టే అని అన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో కంబాళ క్రీడలు జరుగుతున్నాయి. కర్ణాటక తీర ప్రాంతాలతో పాటు కేరళలోని కసర్‌గడ్‌లోనూ ఈ క్రీడలు నిర్వహిస్తారు. అయితే...తొలిసారి బెంగళూరులో కంబాళ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తేజస్వీ సూర్య ఈ వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టునీ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్న కంబాళ క్రీడల్లో 178 మంది పాల్గొంటున్నారు. 

"చాలా మంది సనాతన ధర్మంపై కుట్ర చేస్తున్నారు. సంప్రదాయ క్రీడలైన జల్లికట్టు, కంబాళను అడ్డుకోవాలని కోర్టుల వరకూ వెళ్తున్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలన్నీ విభేదాలు మరిచిపోయి ఒక్కటవ్వాలి. ఈ క్రీడల్ని కాపాడుకోవాలి. తద్వారా సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి. ఈ క్రీడల్ని కాపాడుకుంటేనే మన ధర్మం నిలబడుతుంది"

- తేజస్వీ సూర్య, బీజేపీ ఎంపీ

జల్లికట్టు వేడుకలు జరుపుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా చట్టం చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ ఆటను నిషేధించాలన్న పిటిషన్‌లను తిరస్కరించింది. సంప్రదాయ క్రీడలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరవాత...మళ్లీ అందులో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం సరికాదని వెల్లడించింది. 

"జల్లికట్టు క్రీడపై తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది. అధికారికంగా జరుపుకునేందుకు అనుమతినిచ్చింది. ఇది సంప్రదాయ క్రీడ. అలాంటప్పుడు న్యాయవ్యవస్థ మరో కోణంలో ఆలోచించడం, దానిపై వేరే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం సరికాదు"

- సుప్రీంకోర్టు 

Also Read: వెంటిలేటర్స్ సిద్ధంగా ఉంచుకోండి, చైనా న్యుమోనియా కేసులపై భారత్ మార్గదర్శకాలు

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Continues below advertisement