Sanatan Dharma Row:



సనాతన ధర్మంపై వ్యాఖ్యలు..


దాదాపు నాలుగు రోజులుగా "సనాతన ధర్మం" చుట్టూనే దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ రాజేసిన నిప్పు...అన్ని చోట్లా విస్తరిస్తోంది. బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. కర్ణాటక మంత్రి, మల్లికార్జున్ ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యల్ని సమర్థించారు. ఇప్పుడు కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బౌద్ధం, జైనం ఎప్పుడు మొదలయ్యాయో అందరికీ తెలుసని, మరి సనాతనధర్మం ఎప్పుడు మొదలైందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రపంచ చరిత్రలో ఎన్నో మతాలు పుట్టుకొచ్చాయన్న పరమేశ్వర...హిందూ ధర్మం ఎప్పుడు పుట్టిందో చెప్పాలని అన్నారు. 


"ప్రపంచ చరిత్రలో ఎన్నో మతాలు పుట్టుకొచ్చాయి. జైనిజం, బుద్ధిజం అలా మొదలైనవే. మరి హిందూ మతం సంగతేంటి..? అది ఎప్పుడు పుట్టింది..? ఎవరు మొట్టమొదట ఈ ధర్మాన్ని ఆచరించారు..? ఇప్పటికీ ఇదో ప్రశ్నే. బుద్ధిజం, జైనిజం మతాలకు ఓ చరిత్ర ఉంది. ఇస్లాం, క్రిస్టియానిటీ వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చాయి. ఏదేమైనా అన్ని మతాలు చెప్పేది ఒక్కటే. మానవత్వం అవసరం అని"


- జి పరమేశ్వర, కర్ణాటక హోం మంత్రి