జార్ఖండ్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ చార్టెడ్ అకౌంట్‌తో పాటు మరో సన్నిహితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో రూ.19.31 కోట్ల నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. పూజా సింఘాల్ ఛార్డర్డ్ అకౌంటెట్ సుమన్ కుమార్ వద్ద రూ.17 కోట్లు, మరో చోట రూ.1.8 కోట్లు మేర స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ అధికారులు ప్రకటించారు. పూజా సింఘాల్ ఉపాధి హామీ నిధుల్ని కొల్లగొట్టినట్లుగా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉండటంతో ఆకస్మికంగా సోదాలు చేశారు.
జార్ఖండ్ సహా నాలుగు రాష్ట్రాల్లో సోదాలు చేశారు. వీరి వద్ద స్వాధీనం చేసుకున్న డబ్బును లెక్కపెట్టేందుకు మూడు కౌంటింగ్ యంత్రాలను ఉపయోగించారు. సీజ్ చేసిన మొత్తంలో రూ.2000, రూ.500, రూ.200, రూ.100 కట్టలే ఉన్నాయి. ఇలా నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా ఉండటం.. వాటిని అధికారులు లెక్కిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పూజా సింఘాల్‌పై కేసు ఇప్పటిద ికాదు. 2007-08కి సంబంధించిన ఈ కేసులో గతంలో ఓ జూనియర్ ఇంజీనిర్ ను అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చిన సమాచారంతో ఐఏఎస్ పూజా సింఘాల్ ఇళ్లల్లో సోదాలు చేశారు. చివరికి ఈడీ రంగంలోకి దిగింది. జార్ఖండ్, బిహార్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ముంబయిలలో సోదాలు చేశారు. పూజా సింఘాల్ ప్రస్తుతం జార్ఖండ్ ప్రభుత్వంలోని మైనింగ్, భూగర్భశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
జార్ఖండ్‌లో కాంగ్రెస్- జేఎంఎం కూటమి ప్రభుత్వం ఉంది. పూజా సింఘాల్ వ్యవహారంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఐఏఎస్ అధికారులు అవినీతి చేస్తే ఇలా పేద ప్రజల సొమ్మును దిగమింగేస్తారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.