IIT Guwahati : యాపిల్స్ కొన్నా.. టామాటాలు కొన్నా ఎంత ఫ్రిజ్‌లో దాచుకున్నా వారం రోజులు మాత్రం కాపాడుకోగలం. అప్పటికీ వాడకపోతే వాటిని పడేయాలి. కేజీ.. అర కేజీ కొనే సామాన్యులే ఇలాంటి పరిస్థితి చూసి బాధపడతారు. ఎందుకంటే కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొంటున్నవి మరి. అలాంటిది .. పండించే రైతులకు ఎలా ఉండాలి. ఆరు గాలం శ్రమించి పండించే రైతులు.. పంట చేతికి అందిన తర్వాత వెంటనే అమ్మేసుకోవాలి. లేకపోతే అవి పండిపోవడం.. కుళ్లి పోవడం వంటివి జరుగుతాయి. రైతుల పరిస్థితిని ఆసరా చేసుకుని దళారులు వారి వద్ద తక్కువకే కొని మార్కెట్లో ఎక్కువకు అమ్ముకుని రైతుల కన్నా ఎక్కువ లాభం పొందుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్ని మార్చడానికి చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు అవి ఓ కొలిక్కి వస్తున్నాయి.
వ్యవసాయ రంగంలో వృధాను తగ్గించేందుకు పరిశోధకుల ప్రయోగాలు సక్సెస్
ఐఐటీ గౌహతికి చెందిన పరిశోధకులు ఫ్రూట్స్ మీద.. కూరగాయల మీద పూసే ఓ రకమైన ఎడిబుల్ కెమికల్ తయారు చేశారు. ఇది చెరకు పిప్పి నుంచి తయారు చేస్తారు. ఈ ఎడిబుల్ కెమికల్ ఆరోగ్యానికి ఎలాంటి హానీ చేయలేదు. కానీ ఈ కెమికల్‌ను పూయడం వల్ల ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ.. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనూ పాడవకుండా ఉంటాయి. కనీసం రెండు నెలల పాటు వాటి తాజాదనం తగ్గని ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడయింది. ఈ పరిశోధనల వివరాలను ఐఐటీ గౌహతి ప్రకటించింది. పరిశోధకులు సిద్ధం చేసిన ఎడిబుల్ కెమికల్ ఏ మాత్రం హానికరం కాదని.. అది తినుబండాల వేస్ట్ నుంచి తయారు చేసిందేనని ప్రకటించారు.
స్టెయినబుల్ డెలవప్‌మెంట్ గోల్ పరిశోధనలకు ఫలితం
వ్యవసాయరంగంలో పంట వృధాను తగ్గించడానికి చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి, ప్రాసెసింగ్, సప్లయ్ వంటి విషయాల్లో వ్యవసాయ ఉత్పత్తుల వేస్టేజీని.. నష్టాన్ని నివారించడానికి సస్టెయినబుల్ డెలవప్‌మెంట్ గోల్ పేరుతో పరిశోధనలు చేస్తున్నారు. భారత్‌లో ఇలా వ్యవసాయ రంగంలో కనీసం 15.9 శాతం వరకూ వేస్టేజీ ఉందని రికార్డులు చెబుతున్నారు. ఈ పరిశోధనా ఫలితాలను రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అడ్వాన్నెస్, ఫుడ్ కెమిస్ట్రీ, అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన ఫుడ్ సైన్స్ అంట్ టెక్నాలజీ వంటి అంతర్జాతీయ మ్యాగజైన్లలోనూ ప్రచురించారు.
పూర్తి స్థాయి పరిశోధనల తర్వాత అందుబాటులోకి !
పూర్తి స్థాయి పరిశోదనలు చేసిన తర్వాత రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఐఐటీ గౌహతి ప్రయత్నించే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాలు సంతృప్తి కరంగా ఉండటంతో ప్రయోగాల్ని మరింత విస్తృత పరుస్తున్నారు. ఐఐటీ గౌహతి స్మార్ట్ ఇండియా హ్యాకధాన్‌కు నోడల్ ఎజెన్సీగా ఉంటోంది. కొన్ని ఇతర కార్యక్రమాలనూ చేపడుతోంది. వినూత్నమైన ఉత్పత్తులు కనిపెట్టడంలో .. ఐఐటీ గౌహతి పరిశోధకులు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు.
శృంగారం చేసే ముందు ఆధార్, పాన్ చెక్ చేయక్కర్లేదన్న ఢిల్లీ హైకోర్టు - ఈ కేసు చాలా ఇంట్రెస్టింగ్ !