Delhi HC on Aadhar Card: న్యాయస్థానాల ముందుకు చాలా టిపికల్ కేసులు వస్తూ ఉంటాయి. ఎక్కువగా హత్య, అత్యాచారం వంటి కేసుల్లో ఉన్న కీలకమైన సెక్షన్లు, నిబంధనల కారణంగా అనేక రకాల తీర్పులు ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు కూడా అంతే ఆసక్తికరంగా కనిపిస్తోంది. శృంగారంలో  పాల్గొనేందుకు ఓ జంట పరస్పర ఆమోదం తీసుకున్న తర్వాత వారి ఆధార్, పాన్ కార్డులను ఎవరికి వారు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. పరస్పర ఆమోద యోగ్యమైన శృంగారంలో పాల్గొన్న ఓ జంటలో .. మహిళ వయసు తక్కువగా ఉన్నందున మైనర్ అని.. కేసు దాఖలైంది. ఈ కేసు విషయంలోనే ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 


మైనర్‌ను రేప్ చేసినట్లుగా కేసు -  మైనస్ కాదని సాక్ష్యాలిచ్చిన నిందితుడు


ఇష్ట‌పూర్వ‌క శృంగారంలో పాల్గొనే వ్య‌క్తులు.. భాగ‌స్వామి వ‌య‌సు తెలుసుకునేందుకు ఆధార్‌, పాన్ కార్డు చెక్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది.  మైన‌ర్‌ను రేప్ చేసినట్లు దాఖలైన కేసులో నిందితుడు దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్‌ను ధర్మాసనం విచారించింది. తాను ఇష్టపూర్వక శృంగారంలో పాల్గొన్నానని.. ఆ యువతి మైనర్ అని తనకు తెలియదని నిందితుడు వాదించాడు. పైగా  ఆ మ‌హిళకు రికార్డుల ప్ర‌కారం మూడు ర‌కాల పుట్టిన‌రోజులు ఉన్నాయ‌ని ఆధారాలు చూపించారు. దీంతో రేప్ జ‌రిగిన నాటికి ఆమె మైన‌ర్ కాదు అని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. 


పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నట్లుగా అంగీకారం


ఏకాభిప్రాయంతో శారీర‌క సంబంధం పెట్టుకున్న వ్య‌క్తి .. త‌న భాగ‌స్వామి డేట్ ఆఫ్ బ‌ర్త్‌ను తెలుసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, దాని కోసం ఆ వ్య‌క్తి ఆధార్‌, పాన్ కార్డును ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం లేద‌ని కోర్టు పేర్కొన్న‌ది. ఆధార్ కార్డులో ఆ మ‌హిళ పుట్టిన రోజు 01.01.1998గా ఉంది.  ఈ ఒక్క ఆధారంతో ఆమె మైన‌ర్ కాదు అని తెలుస్తోంద‌ని జ‌డ్జి తెలిపారు. అయితే అమ్మాయికి భారీ మొత్తంలో డ‌బ్బు ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యింద‌ని ఇది కూడా ఓ కార‌ణం అవుతుంద‌ని కోర్టు తెలిపింది. నిందితుడికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అదే సమయంలో  హ‌నీ ట్రాపింగ్ కేసుల గురించి జ‌డ్జి త‌న తీర్పులో ప్ర‌స్తావించారు. పోలీసులు అలాంటి కేసుల్ని సునిశితంగా విచారించాల‌ని ఆదేశించారు.


అత్యాచారం కేసుల్లో    తీర్పులు చర్చనీయాంశం 


అత్యాచారం కేసుల్లో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు పలు సందర్భాల్లో చర్చకు కారణం అవుతున్నాయి. అయితే చట్ట ప్రకారం చూస్తే ఆ తీర్పులన్నీ సమంజనసమైనవేనని న్యాయనిపుణులు చెబుతూ వస్తున్నారు. ఏదైనా ఓ ఇన్సిడెంట్ జరిగితే.. తప్పు అంతా పురుషుల వైపు నుంచే జరిగిందన్న ఓ అభిప్రాయానికి రావడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పలు సందర్భాల్లో  ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొన్న మహిళలు తర్వాత .. చాలా కాలం గడిచిన తర్వాత కూడా అత్యాచారం కేసులు పెడుతూండటం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది.