Yellow Crazy Ants : దెయ్యాలు ఉన్నాయని, ఆత్మలు తిరుగుతున్నాయని భయంతో ఊర్లు ఖాళీ చేసిన సందర్భాలు ఉన్నాయి. చేతబడులు చేశారన్న సందేహంతో ఊళ్లకు ఊళ్లే వసల వెళ్లిన ఘటనలు కూడా చూశాం. కానీ చీమలకు భయపడి ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేస్తున్నారంటే ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటే మీరు పొరపడినట్లే. అటవీ ప్రాంతం నుంచి గ్రామాల్లోకి వస్తున్న చీమలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
అసలేం జరిగింది?
తమిళనాడు రాష్ట్రం దిండుక్కల్ జిల్లా కరంతమలై రిజర్వ్ ఫారెస్టు సమీప గ్రామాల్లోని ప్రజలను చీమలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. గత కొంత కాలంగా చీమలు అటవీ ప్రాంతాన్ని వదిలి గ్రామాల్లోకి వస్తూ పంట పొలాలను నాశనం చేయడమే కాకుండా ఏది దొరికితే దానిని ఆరగించేస్తున్నాయి. రైతులకు చెందిన మేకలు, పశువులు, ఎద్దులకు హాని చేయడంతో పాటుగా, ఎలుకలు, పిల్లులు, కుందేళ్లలపై దాడి చేసి వాటి చంపేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా లక్షల సంఖ్యలో ఎల్లో క్రేజీ చీమలు గ్రామాల్లో వస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నిముషాల్లో మనుషులపై పాకుతూ ఫార్మిక్ యాసిడ్ ను విడుదల చేస్తున్నాయి. ఇలా ఫార్మిక్ యాసిడ్ ను విడుదల చేయడం ద్వారా మనిషి శరీరంపై దురదలు, చర్మం పొట్టులా రాలడం జరుగుతున్నాయి. పశువుల కంట్లో ఈ చీమలు పడితే పూర్తిగా చూపు కనిపించకుండా పోతుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు చీమల దండుకు భయపడి ఊళ్లను ఖాళీ చేస్తున్నారు. చీమల నివారణకు అనేక మందులు ఉపయోగించినా ఏమాత్రం వాటిపై ఫలితం చూపలేకపోతుండడంతో స్థానికులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
ఎల్లో క్రేజీ చీమలు
గత కొంత కాలంగా కరంతమలై రిజర్వ్ ఫారెస్టు సమీప ప్రాంత ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో అటవీశాఖ అధికారులు, కీటక శాస్త్రవేత్తలు రంగంలోకి దిగ్గారు. అటవీ ప్రాంతంలోని చీమల నమూనాలను సేకరించి పరిశోధనకు పంపడంతో పాటు, వీటి నైజంను పరిశీలిస్తున్నారు అధికారులు. ఇవి అత్యంత ప్రమాదకరమైనవన్నారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ప్రపంచంలోని తొలి 100 ప్రమాదకరజాతుల్లో వీటిని చేర్చారని పర్యావరణవేత్త వైల్డ్ లైఫ్ పరిశోధకులు అంటున్నారు. ఎల్లో క్రేజీ యాంట్ దాడులు గతంలో కేరళ అడవుల్లోని పలు గ్రామాల్లో కనిపించాయని వీటిని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ ప్రతినిధులు పరిశోధన జరిపారని అధికారులు అంటున్నారు. తాజాగా ఎల్లో క్రేజీ చీమ జాతుల విస్తరణ బాగా పెరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
పశువులకు అంధత్వం
తమిళనాడులో ఎల్లో క్రేజీ చీమలు పశువులను అంధత్వానికి గురిచేస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ చీమలు రాష్ట్రంలోని పంటల దిగుబడిని కూడా దెబ్బతీస్తూ, పశువులపై దాడి చేస్తున్నాయి. తమిళనాడులోని పలు గ్రామాల్లో ఎల్లో క్రేజీ యాంట్స్ దాడితో పశువులు, పాములు చనిపోయాయి.
Also Read : తోడేలు పులికి మళ్లీ జీవం, అంతరించిపోతున్న జీవికి ప్రాణం పోసేందుకు ప్రయత్నాలు!
Also Read : కొండచిలువను మింగేసిన పాము, దీని ఎక్స్‌రే చూస్తే షాకవుతారు