నా భర్తకు జీవిత శిక్ష పడింది.. కానీ నాకెందుకు శిక్ష అని ఓ భార్య కోర్టును ఆశ్రయించింది. నిజానికి ఆమెకు కోర్టు ఏ శిక్షా వేయలేదు. కానీ తన భర్తకు జీవిత ఖైదు వేయడం వల్ల తాను పిల్లలను కనే అవకాశం కోల్పోయానని అది తనకు శిక్షేనని ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. తన భర్తకు పదిహేను రోజుల పాటు పెరోల్ ఇస్తే తాము సంపారం చేసుకుంటామని..  తద్వారా బిడ్డను కంటామని... ఆమె పిటిషన్‌లో పేర్కొంది. ఇలాంటి కారణంతో ఇంత వరకూ ఎవరూ పెరోల్ కోసం ప్రయత్నించి ఉండరు. కానీై ఆమె ప్రయత్నించింది.. తన భర్తకు పదిహేను రోజుల పాటు పెరోల్ తెచ్చుకుంది. మరి పదిహేను రోజుల్లో సంపారం చేసి... బిడ్డను కంటుందో లేదో తెలియదు కానీ ఆమె మాత్రం తన వంశాకురం కోసం ఓ ప్రయత్నం చేసింది. 


రాజస్తాన్‌కు చెందిన లాల్ అనే వ్యక్తి తీవ్రమైన నేరం కింద దోషిగా తేల్చారు. ఆయనకు జీవిత ఖైదు విధించారు. అప్పట్నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. పెరోల్ కోసం చాలా సార్లు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇటీవల తన భర్త లాల్‌కు పదిహేను రోజులకు పెరోల్ ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ జైలు అధికారులు దాన్ని పక్కన పెట్టారు. బిడ్డను కనేందుకు తన భర్తకు పెరోల్ ఇవ్వాలని ఆమె కోరడంతో ఆమె అప్లికేషన్‌ను పక్కన పెట్టారు. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన రాజస్థాన్ హైకోర్టు.. .రాజస్థాన్ ఖైదీల విడుదల పెరోల్ రూల్స్‌ లో అలాంటి కారణాలతో పెరోల్ ఇవ్వకూడదన్న నిబంధన లేదని గుర్తు చేసింది.  


వివాహ బంధం వల్ల ఆమె ఎలాంటి సమస్యలూ ఎదర్కోలేదని.. భన భర్త ద్వారా ఓ బిడ్డను కనాలనుకుంటోందని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. వీరి వాదనలు విన్న హైకోర్టు  "ఖైదీ భార్య సంతానం పొందే హక్కును కోల్పోయింది, ఆమె ఎటువంటి నేరం చేయలేదు , ఎటువంటి శిక్షకు గురి కాలేదు. అందువల్ల, ఖైదీ-ఖైదీ తన భార్యతో  సంసారం చేయడానికి నిరాకరించడం, సంతానం లేకుండా చేయడం అతని భార్య హక్కులను ప్రభావితం చేస్తుంది" అని కోర్టు అభిప్రాయపడింది. సంతానం పొందే హక్కు మత గ్రంథాలలో కూడా ఉందని కోర్టు చెప్పింది.  హిందూ పురాణాల ప్రకారం 'పిత్రా-రిన్'ను ప్రస్తావించింది.   రూ. 25,000 చొప్పున రెండు పూచీకత్తుతో పాటు రూ. 50,000 వ్యక్తిగత బాండ్‌ను అందించడంపై లాల్‌ను 15 రోజుల పెరోల్‌పై విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.


పిల్లల్ని కనేందుకు ప్రత్యేకంగా సంపారం చేసేందుకే పట్టుబట్టి భర్తకు పెరోల్ సాధించుకున్న భార్య ప్రయత్నం వైరల్ అయింది.