కర్ణాటకలో ఆకతాయిలో.. నిజంగానే ప్లాన్ చేస్తున్నారో తెలియదు కానీ స్కూళ్లతో పాటు ప్రముఖులకూ వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. శుక్రవారం రోజుల బెంగళూరులోని ఏడు ఇంటర్నేషనల్ సూక్ల్స్కు ఒకేసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఏడు పాఠశాలకు ఈ మెయిల్‌ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బెదిరింపులు వచ్చిన పాఠశాలలకు హుటాహుటినా చేరుకొని పోలీసులు బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. స్కూళ్ల నుంచి విద్యార్థులను ఖాళీ చేశారు.  అయితే ఇప్పటి వరకు ఏ పాఠశాలలోనూ పేలుడు పదార్థాలు లభించలేదు.  ఆకతాయిల పనిగా పోలీసులు భావిస్తున్నా... సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. 





స్కూళ్లలో బాంబుల బెదిరింపుల వ్యవహారం సద్దుమణగక ముందే  మాజీ సీఎంలు సహా  63 మందిని ఏ క్షణంలోనైనా చంపేస్తామని సోషల్ మీడియాల బెదిరింపులు వచ్చాయి.  మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్యలకు చంపేస్తామంటూ గుర్తు వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి.  మరో 61 మంది రచయితలకు కూడా ఇదే తరహా లేఖలు అందాయి. అయితే, ఈ లేఖలు ఎవరు పంపించారనేది ఇంకా తెలియరాలేదు. కాగా, సిద్ధరామయ్య, కుమారస్వామితో పాటు మిగిలిన రచయితలను దేశద్రోహులుగా అభివర్ణిస్తూ వారు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఓ వర్గం పక్షాన ఉంటూ.. హిందూ సమాజంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.  ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు. మీ అంత్యక్రియలకు సిద్ధంగా ఉండమని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి' అని రాసి ఉంది.  ఆ లేఖల చివర్లో ఓ సహనం కలిగిన హిందువు అని రాసి ఉండడంతో చర్చనీయాంశంగా మారింది. 



గతంలో రచయితలు కలుబురిగి, లంకేష్ వంటి వారిని హత్య చేశారు. అంతకు ముందు కూడా వారికి బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో ఈ  బెదిరింపుల్ని సీరియస్‌ా తీసుకోవాలన్న డిమాండ్లు కర్ణాటకలో వినిపి్తున్నాయి. బెదిరింపు లేఖలు అందుకున్న రచయితలకు తక్షణమే తగిన భద్రత కల్పించాలని  పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కూళ్లకు వచ్చిన బెదిరింపు లేఖలు.. అలాగే రాజకీయ నేతలు, రచయితలకు వచ్చిన లేఖలకు సంబంధం ఉందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. రెండు అంశాల్లోనూ పోలీసులు ఎవరి పని అనే దానిపై పరిశోధన చేస్తున్నారు. ఇంకా నిందితులెర్నీ పట్టుకోలేదు.