ఈ ఉదయం ఉత్తర్‌ప్రదేశ్ సీఎం ఆఫీస్ ట్విట్టర్ ఖాతపై హ్యాకర్లు దాడి చేశారు. అకౌంట్‌ను హ్యాక్ చేసి పిచ్చిపిచ్చి మెసేజ్‌లు పోస్టు చేశారు. ప్రొఫైల్ పిక్చర్‌ను కూడా మార్చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్ సీఎం ఆఫీస్ ట్విట్టర్‌ను నాలుగు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఉదయం చూస్తే కనిపించిన మెసేజ్‌లు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ట్విట్టర్ ఆధారంగా చేసుకొని నడిచే ట్యుటోరియల్ యాడ్ చూసి అంతా షాక్ అయ్యారు.
అప్పటి వరకు ఉన్న సీఎం యోగి ఫొటో ప్లేస్‌లో ఓ క్యారికేచర్ ఫొటో ప్రత్యక్షమైంది. బెదిరిస్తూ హాక్యర్లు కొన్ని స్క్రీన్ షాట్లను కూడా పోస్టు చేశారు.
ఇది గుర్తించిన కాసేపటికే ట్విట్టర్‌ను రీస్టోర్ చేసినట్టు సీఎంవో ప్రకటించింది. ఇప్పుడు సమస్య లేదని తెలిపింది.
ప్రముఖ సంస్థల, వ్యక్తుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఫిబ్రవరిలో కూడా భారతీయజనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అకౌంట్ కూడా హ్యాక్ అయింది. "ICG OWNS INDIA"పేరుతో అకౌంట్ మార్చేశారు. ఉక్రెయిన్ ప్రజల కోసం క్రిప్టో కరెన్సీ రూపంలో డొనేషన్లు ఇవ్వాలని దాని నుంచి రిక్వస్ట్ చేశారు.
హ్యాక్ అయిన విషయాన్ని తెలుసుకున్న నడ్డా ఆఫీస్.. ఆ ట్వీట్‌లను డిలీట్ చేసి ఖాతాను రీస్టోర్ చేశారు. గతేడాది డిసెంబర్‌లో కూడా ప్రధానమంత్రి మోదీ ట్విట్టర్ అకౌంట్‌ను కూడా హ్యాక్ చేశారు.