ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భాజపా సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసిన బుల్డోజర్‌లే కనిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తామని యోగి ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. అయితే ఈసారి యూపీలో కాకుండా రాజస్థాన్‌లో బుల్జోజర్ పెద్ద దుమారం రేపింది. బుల్డోజర్ ఏకంగా ఓ ఆలయాన్నే కూల్చివేసింది. అది కూడా సాధారణ ఆలయం కాదు.. 300 ఏళ్ల క్రితం నిర్మించిన గుడి.
ఏం జరిగింది?
నిన్నటి వరకు అక్రమ కట్టడాలు, రోహింగ్యా నివాసాలపైకి మాత్రమే వెళ్లాయి బుల్డోజర్‌లు. కానీ తాజాగా రాజస్తాన్‌లోని అల్వాజ్ జిల్లాల సరై మొహల్ల గ్రామంలో 300 ఏళ్ల క్రితం నాటి ఒక గుడిని బుల్డోజర్‌తో కూల్చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై సరై మొహల్ల నగర పంచాయతీ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్, అల్వార్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, స్థానిక ఎమ్మెల్యే రాజ్‌ఘర్‌లపై పోలీసు కేసు నమోదైంది.
రాజస్థాన్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఉద్దేశపూర్వకంగానే ఆలయాన్ని కాంగ్రెస్ సర్కార్ కూల్చివేసినట్లు భాజపా ఆరోపిస్తోంది. గుడిని కూల్చేస్తోన్న వీడియోను భాజపా ఐటీ సెల్ విభాగం ఇంఛార్జ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
భాజపానే చేసింది
ఈ అల్వార్ ఆలయ కూల్చివేత భాజపా అధికారంలో ఉన్న సమయంలోనే మొదలైందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ సమయంలో భాజపా నేతలే ఇందుకు అనుమతులు ఇచ్చారని పేర్కొంది. ఎన్నికలు వస్తోన్న సమయంలో కావాలనే కూల్చివేతలను కాంగ్రెస్‌పైకి నెడుతున్నట్లు విమర్శించింది. ఓట్ల కోసమే భాజపా ఈ పనులు చేస్తున్నట్లు రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ దొతసారా ఆరోపించారు.
Also Read: Karnataka: యువకుడ్ని చెంప దెబ్బ కొట్టిన ఎమ్మెల్యే- ఎందుకో తెలుసా?