సైబర్ హ్యాకర్లు రైల్ యాత్రి యాప్ ను టార్గెట్ చేశారు. రైల్ యాత్రి యాప్ యూజర్ల డేటాను హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఇందులో యూజర్ల పేర్లు, ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు, వారి లొకేషన్ వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ఈ డేటాను డార్క్ వెబ్ లో అమ్మకానికి పెట్టారు. సైబర్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.


ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)కు చెందిన యాప్ రైల్ యాత్రి. ఇది టికెట్లను బుక్ చేయడానికి, వారి పిఎన్ఆర్ స్టేటస్‌ తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా భారతదేశంలో రైలు ప్రయాణానికి సంబంధించిన ఇతర సమాచారాన్ని కూడా తెలుసుకునేందుకు ఈ యాప్‌ను వినియోగదారులు యూజ్ చేస్తుంటారు. 


ఓ అంచనా ప్రకారం... రైల్ యాత్రి నుంచి 3 మిలియన్ల మంది డేటాను చోర చేశారు హ్యాకర్లు. దీన్ని డార్క్ వెబ్ లో అమ్మకానికి ఉంచారు. ఈ విషయాన్ని ఓ హ్యాకర్ తెలియజేశాడు. డిసెంబర్‌ 3న డేటాను హ్యాక్ చేసినట్లు హ్యాకర్ పేర్కొన్నాడు. యూనిట్ 1 డేటా పేరుతో డార్క్‌వెబ్‌లో పెట్టిన ఈ లింక్‌ ద్వారా డేటా కొనుగోలుకు తమను సంప్రదించాలని వివరించాడు.  


ముఖ్యంగా ఫోన్ నంబర్ల వంటి డేటా ఇతరుల చేతికి చిక్కితే ప్రమాదమంటున్నారు నిపుణులు. దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువ ఉందన్నారు.  పోలీసు అధికారులుగా నటిస్తూ సెక్స్ రాకెట్లు, పార్ట్ టైమ్ పేరుతో మోసాలు, ఆర్థిక మోసాలకు సైబర్‌ నేరగాళ్లు పాల్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పేరు, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఉపయోగించి నకిలీ డాక్యుమెంట్లు కూడా సృష్టించవచ్చని హెచ్చరిస్తున్నారు. .


డేటా పాయింట్ అనేది వినియోగదారుల పేర్లు, ఇమెయిల్ ఐడిలు, చిరునామాలు మరియు ఫోన్ నంబర్లను కలిగి ఉన్న ఓరకమైన డేటా. డేటా లీకేజీపై ఎలాంటి అధికారిక సమాచారం లేదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ రైల్వే అధికారి తెలిపారు. డేటా లీక్ వార్తలను పరిశీలిస్తున్నామన్నారు. గూగుల్ ప్లే స్టోర్ ప్రకారం, ఈ యాప్‌ను ఇప్పటివరకు 5 మిలియన్లకు పైగా వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నారు.


మొత్తం డేటాలో 12 గిగాబైట్లకుపైగా డేటాను అమ్మకానికి ఉంచారు. మొత్తం 3,10,62,673 డేటా పాయింట్లు ఉన్నాయని ఫోరంలో పోస్ట్ పేర్కొంది. యూనిట్ 12 ఇజ్రాయెల్ కేంద్రంగా పనిచేస్తోందని, ఆగస్టు 33, 82 నుంచి బ్రీచ్ ఫోరంలో సభ్యురాలిగా ఉందని అందులో చెప్పిన బయో ప్రకారం తెలుస్తోంది.