Bomb Threat Call: 



విస్టారా ఫ్లైట్‌లో..


ఢిల్లీ నుంచి పుణేకి వస్తున్న విస్టారా ఫ్లైట్‌లో బాంబు పెట్టామంటూ ఓ ఆగంతుకుడు కాల్ చేసి బెదిరించడం అలజడి రేపింది. GMR కాల్‌ సెంటర్‌కి కాల్ చేసి ఫ్లైట్‌లో బాంబు పెట్టామని ఎవరో బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఫ్లైట్‌ని ఐసోలేట్ చేసింది. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. లగేజ్‌నీ కిందకి దించింది. విమానంలో తనిఖీలు చేపట్టారు. ఉదయం 8.53 గంటలకు ఈ బెదిరింపు కాల్ వచ్చింది. అయితే...ఇప్పటి వరకూ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు ఫ్లైట్‌లో కనిపించలేదు. లోపల, బయట పూర్తిగా పరిశీలించిన సిబ్బంది పేలుడు పదార్థాలు ఏమీ లేవని చెప్పాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో కావాలనే ఈ కాల్ చేసుంటారని, ఫేక్ అయ్యుంటుందని భావిస్తున్నారు. ఫేక్ కాల్‌గా ప్రకటించారు. ప్రస్తుతానికి ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై FIR నమోదు చేశారు. ఫేక్ కాల్ చేసిన వ్యక్తి ఆచూకీని కనిపెడతామని వెల్లడించారు.