దుపట్టా లాగడం, చేతిని లాగడం.. లైంగికంగా వేధించకుండా పెళ్లి చేసుకోమని అడగితే.. అది పోక్సో కిందకు రాదని కలకత్తా హైకోర్టు తెలిపింది. జస్టిస్ బిబేక్ చౌదరి ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. రికార్డులో ఉన్న సాక్ష్యాలను అంచనా వేయడంపై ట్రయల్ కోర్టు పాత్రను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసింది.
ఇంతకీ కేసు ఏంటంటే..
బాధిత బాలిక ఆగస్టు 2017లో పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా.. నిందితుడు ఆమె దుపట్టా లాగి పెళ్లి చేసుకోమని ప్రతిపాదించాడు. ఒకవేళ వినకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. తనను లైంగికంగా వేధించాడని ఆ బాలిక కోర్టుకు వెళ్లింది. బాలిక చెప్పిన సాక్ష్యాలను విన్న ట్రయల్ కోర్టు.. బాధిత బాలిక దుపట్టా లాగడం.., వివాహం చేసుకోవాలనడం.., లైంగిక ఉద్దేశంతో జరిగిందని తేల్చింది. బాలిక చేయి లాగి.. పెళ్లిచేసుకోమనడం వేధింపులకు కిందకు వస్తుందని.. నిందితుడిని దోషిగా గుర్తించింది.
ఈ మేరకు పోక్సో చట్టంలోని సెక్షన్లు 8 మరియు 12, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 354, 354B, 506 మరియు 509 కింద నిందితుడిని దోషిగా నిర్ధారించారు. అంతేకాకుండా, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 A (1)(ii) ప్రకారం నిందితుడి నిర్దిష్ట చర్య లైంగిక వేధింపుల స్వభావంలో ఉందని ట్రయల్ కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసుపై నిందితుడు హైకోర్టుకు వెళ్లాడు. సాక్ష్యాధారాలను పునఃపరిశీలిస్తే బాధితురాలి వాంగ్మూలంలో వ్యత్యాసాలు ఉన్నాయని హై కోర్టు గుర్తించింది. నిందితుడు బాధితురాలి చేతిని లాగినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనలేదని చెప్పింది. అయితే 10 రోజుల తర్వాత నమోదు చేసిన సెక్షన్ 164 సీఆర్ పీసీ కింద.. నిందితుడి తన చేతిని లాగినట్లు బాలిక చెప్పడాన్ని కోర్టు గుర్తించింది.
అప్పీలుదారు.. బాధితురాలి దుపట్టా లాగడం, చేతిని లాగి పెళ్లి చేసుకోమని అడిగినట్టు భవించినప్పటికీ.. అలాంటి చర్య లైంగిక వేధింపుల కిందకు రాదని హైకోర్టు చెప్పింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 506తోపాటు సెక్షన్ 354 A కింద నేరం చేసినందుకు అతను బాధ్యత వహించవచ్చని తెలిపింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 354, 354B మరియు 509 కింద అభియోగాల నుంచి అప్పీలుదారు నిర్దోషి అని నిర్ధారించారు.
Also Read: Govt on Farmers Protests: 'ప్చ్.. రైతులు చనిపోయారా? మాకు తెలియదే.. పరిహారం ఎలా ఇస్తాం?'
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదు, 267 మంది మృతి
Also read: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు
Also Read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు