Prophet Remark Row: దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన చేపట్టారు. దిల్లీ జామా మసీదు వద్ద భారీగా నిరసన ప్రదర్శన చేశారు ముస్లింలు. దిల్లీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్, బంగాల్, మధ్యప్రదేశ్, హైదరాబాద్‌లో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
బంగాల్, యూపీలో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ వదిలారు.
జామా మసీదు
ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దిల్లీలోని జామా మసీదులో ఇవాళ భారీ ప్రదర్శన చేపట్టారు. భారీ సంఖ్యలో ముస్లింలు మసీదు వద్ద ఆందోళన నిర్వహించారు. దేశంలో అతిపెద్ద మసీదైన జామా మసీదు వద్ద ఇవాళ శుక్రవారం ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లింలు నినాదాలు చేశారు.
ఓవైసీపై..
ఈ నిరసన ప్రదర్శనపై మసీదు కమిటీ స్పందించింది. ఈ నిరసనకు తాము పిలుపు ఇవ్వలేదని జామా మసీదు షాహి ఇమామ్ తెలిపారు. మసీదు ముందు నిరసన ప్రదర్శన చేపట్టినవారు ఎవరో తమకు తెలియదన్నారు. శుక్రవారం ప్రదర్శన చేపట్టాలని కొందరు గురువారం ప్లాన్ చేశారని, కానీ వాళ్లకు మసీదు అనుమతి ఇవ్వలేదని షాహి ఇమామ్ తెలిపారు. ఆందోళన చేపట్టినవాళ్లు బహుశా ఎంఐఎం పార్టీ లేదా ఓవైసీ మద్దతుదారులై ఉంటారని ఆయన అన్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ సహా ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, యతి నర్సింగానంద్పై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత సందేశాలకు సంబంధించి వీరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
విద్వేషపూరిత సందేశాలను వ్యాప్తి చేయడం, వివిధ గ్రూపులను రెచ్చగొట్టడం, ప్రజల ప్రశాంతతకు విఘాతం కలిగించే పరిస్థితులను సృష్టిస్తున్నారనే ఆరోపణలతో మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు.
Also Read: Presidential Poll: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరు?- సోనియా గాంధీ మంతనాలు