Priyanka Gandhi Corona Positive: కాంగ్రెస్‌లో కరోనా కలకలం- ప్రియాంక గాంధీకి కొవిడ్ పాజిటివ్

Advertisement
ABP Desam   |  Edited By: Murali Krishna Updated at: 03 Jun 2022 11:00 AM (IST)

Priyanka Gandhi Corona Positive: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా సోకింది.

కాంగ్రెస్‌లో కరోనా కలకలం- ప్రియాంక గాంధీకి కొవిడ్ పాజిటివ్

NEXT PREV

Priyanka Gandhi Corona Positive:  కాంగ్రెస్‌లో కరోనా కలకలం రేపింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురికి కరోనా పాజిటివ్ అని గురువారం తెలిసింది. అయితే తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కూడా కొవిడ్ పాజిటివ్ అని తేలింది.

Continues below advertisement



స్వల్ప లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా నిబంధనలను పాటించి క్వారంటైన్‌లో ఉన్నాను. నన్ను ఇటీవల కలిసిన వారంతా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.                                                            -  ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి    






ఈడీ విచారణ వేళ


సోనియా గాంధీకి గురువారం కరోనా పాజిటివ్ వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు హాజరుకావాల్సిన వేళ సోనియాకు వైరస్ సోకింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు.


స్వల్ప జ్వరంతో పాటు ఆమెకు కొన్ని కరోనా లక్షణాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఐసోలేషన్‌లో ఉన్నారని, వైద్య సాయం అందించినట్లు సుర్జేవాలా పేర్కొన్నారు. అయితే జూన్ 8న ఆమె ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉందని తెలిపారు.



సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు కూడా కరోనా సోకింది. దీంతో ఇటీవల సోనియాను కలిసిన నేతలంతా ఐసోలేషన్‌లో ఉన్నారు.


ఈడీ నోటీసులు


నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కోసం జూన్ 8న సోనియాను హాజరుకావాలని ఈడీ నోటీసులో సూచించింది. రాహుల్ గాంధీ గురువారం హాజరుకావాల్సి ఉంది. అయితే తాను కూడా సోనియా గాంధీతో కలిసి విచారణకు హాజరవుతానని రాహుల్ గాంధీ.. ఈడీని కోరినట్లు తెలుస్తోంది.


Also Read: LPG Cylinder Subsidy : సామాన్యులకు కేంద్రం భారీ షాక్, ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ తొలగింపు


Also Read: Pakistan Petrol Price: ఏకంగా రూ.30 పెరిగిన పెట్రోల్ ధర - అక్కడ డబుల్ సెంచరీ దాటిన పెట్రోల్, డీజిల్ రేట్లు



Published at: 03 Jun 2022 10:44 AM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.