ప్రధానమంత్రి మోదీ తల్లీ హీరాబెన్ వందో పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ... తన తల్లిని గుజరాత్‌లో కలిశారు. ఆమె కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెతో కలిసి ఇంట్లోనే పూజామందిరంలో ప్రత్యేక పూజలు చేశారు


గాంధీనగర్‌లోని రాయసన్‌ గ్రామంలో మోదీ సోదరుడు పంకజ్‌ మోదీతో కలిసి హీరాబెన్‌ నివశిస్తున్నారు. వాంద్‌నగర్‌లోని హట్కేశ్వర్‌ మహదేవ్‌ టెంపుల్ నిర్వాహకులు హీరాబెన్ కలకాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. 






పంచమహాల్స్‌జిల్లా పావ్‌గఢ్‌లోని మహంకాళి దేవాలయాన్ని మోదీ సందర్శించనున్నారు. దీన్ని పునర్‌నిర్మించిన తర్వాత ప్రధాని మోదీ సందర్శించడం ఇదే తొలిసారి. అక్కడ జరిగే ధ్వజస్తంభ ప్రతిష్టలో పాల్గోనున్నారు. 


పావ్‌గఢ్‌.. గుజరాత్‌లో చాలా ఫేమస్ పర్యాటక ప్రదేశం. దేశంలోని ఉన్న 52 శక్తి పీఠాల్లో పావ్‌గఢ్‌ ఒకటి. ఇతి పురాతనమైన మా కాళీ టెంపుల్ ఇక్కడ ఉంది. ఇక్కడ విశ్వామిత్ర తపస్సులు చేసేవారని ఇక్కడి వారి నమ్మకం. 
పావ్‌గఢ్‌ సముద్రమట్టానికి 762 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ శక్తిపీఠాన్ని చేరుకోవడానికి మెట్లమార్గంతోపాటు, రోప్‌వే సౌకర్యం కూడా ఉంది. పావ్‌గఢ్‌లోని దేవాలయాన్ని 2004లో ప్రపంచ వారసత్వ సంపదా యునిస్కో గుర్తించింది. ఎంతు ప్రాసస్త్యం ఉన్న ఈ గుడిని చాలా ఏళ్ల నుంచి అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఒక దేవాలయంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేశారు. దేవాలయ పునః ప్రారంభానికి ప్రధాని మోదీ రావడంతో భద్రతా కారణాల దృష్ట్యా భక్తులను రానివ్వలేదు. గురువారం నుంచే భద్రతా దళాలు దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 


దేవాలయ శిఖరం శిథిలమై పడిపోవడంతో పూర్తిగా దేవలయాన్ని పునర్‌నిర్మించారు. గర్భగుడిని బంగారు తాపడంతో తీర్చిదిద్దారు. ఒకప్పుడు ఈ గర్భగుడి సమీపంలోనే దర్గా కూడా ఉండేది. దీనిపై ఎప్పటి నుంచో వివాదం నడిచింది. కోర్టుల్లో కేసులు కూడా నడిచాయి. కానీ నాలుగేళ్ల క్రితం ఇరు వర్గాలు కూర్చొని అక్కడి నుంచి దర్గా తీసేసే వేరే ప్రాంతంలో నిర్మించేందుకు అంగీకరించారు. అదే టైంలో గుడి పునర్‌నిర్మాణానికి కూడా అడుగులు పడ్డాయి.