Lok Sabha Elections 2024: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 లోక్‌ సభ ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. మరో 15, 20 రోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్న టైంలో ముందుగానే ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ప్రచారం ప్రారంభించబోతున్నారు. 


రేపు మోదీ ఎన్నికల శంఖారావం


జనవరి 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్షార్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొంటారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో పార్టీ నేతలు, శ్రేణులు ఫుల్ బిజీగా ఉన్నారు. పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుంకే బులంద్షార్‌లో మీటింగ్ పెడుతంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ 14 స్థానాలకి ఎనిమిదింటిని బీజేపీ గెలుచుకుంది. ఈ సంఖ్యను మరింత పెంచుకోవాలని చూస్తోంది. 


యూపీలో క్లీన్‌ స్వీప్ చేయాలని ప్లాన్


గతంలో జరిగిన తప్పులను ఓసారి రివ్యూ చేసుకొని స్థానికంగా ఉండే సమస్యలను ప్రస్తావిస్తూ మరింత అభివృద్ధి సాధిస్తామని భరోసా ఇచ్చేలా ఎన్నికల మీటింగ్ ఉంటుందని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో అన్ని సీట్లు కైవశం చేసుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. దీనికి బులంద్షార్‌ మీటింగ్‌ ఇంధనంలా పని చేస్తుందని బీజేపీ లీడర్లు భావిస్తున్నారు. అదే ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 25 జరిగే మీటింగ్‌ కోసం ఐదు లక్షలపైగా జనాలను సమీకరించాలి బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఆరంభం అదిరిపోయేలా ఉంటుందని చెబుతున్నారు. బులంద్షార్‌లోని నవదా గ్రామంలో ఈ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. 


మీటంగ్‌లకు సిద్ధమవుతున్న అఖిలేష్‌ కూటమి


లోక్‌దల్‌, సమాజ్‌వాది పార్టీ పొత్తు తర్వాత మాట్లాడిన అఖిలేష్ యాదవ్ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్కువ సీట్లు గెలుచుకుంటామన్నారు. ఇండియా పక్షాల్లో సీట్ షేరింగ్‌పై ఒక స్పష్టత వచ్చిన తర్వాత యూపీలో మరిన్ని మీటింగ్స్ పెడతామన్నారు. కచ్చితంగా ఇండియా పక్షాలు బలపడతాయని జోస్యం చెప్పారు. ఈ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే బీజేపీ మీటింగ్‌ కోసం సన్నాహాలు చేస్తున్నట్టు లీకులు ఇచ్చింది. 
లక్నోలో కీలమైన నేతలతో సమావేశమై అఖిలేష్‌ యాదవ్... ఈసారి విజయం సాధించే అవకాశాలు ఉన్న వాళ్లకు మాత్రమే సీట్లు ఇస్తామన్నారు. వారి విజయం కోసం అంతా సహకరించాలని కోరారు. ఇంతలో ఓటర్ల లిస్టులో పేర్లు నమోదు చేసుకోవాలని దీనిపై ప్రజలకు సహాయం చేయాలని సూచించారు. వ్యతిరేకంగా ఉన్న ఓట్ల బీజేపీకి తొలగిస్తోందని ఆరోపించారు.