EdCIL Recruitment: ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (EDCIL), భూటాన్ ప్రభుత్వం తరఫున కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీజీటీ (PGT) టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత సబ్జెక్ట్‌లో బీఈడీ/పీజీ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఫిభ్రవరి 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్ట్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ, ఫిజికల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారు విధిగా భూటాన్‌ దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.


వివరాలు..


* పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు


ఖాళీల సంఖ్య: 100


కాంట్రాక్ట్ వ్యవధి: 2 సంవత్సరాలు.


➨ కంప్యూటర్ సైన్స్/ICT: 28


➨ ఫిజిక్స్: 18


➨ కెమిస్ట్రీ: 19


➨ మ్యథమెటిక్స్: 35


అర్హతలు: 


➥ కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.


➥ పీజీటీ మ్యాథమెటిక్స్, పీజీటీ కెమిస్ట్రీ మరియు పీజీటీ ఫిజిక్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఎడ్ డిగ్రీ తప్పనిసరి.


➥ పీజీటీ కంప్యూటర్ సైన్స్ / ICT పోస్ట్ కోసం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఎడ్ డిగ్రీ ఉత్తమం(తప్పనిసరి కాదు).


➥ ఆంగ్ల భాష బోధనలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.


➥ పీజీటీ టీచర్ తప్పనిసరిగా 11వ మరియు 12వ తరగతులలో సంబంధిత సబ్జెక్టు బోధనలో 5 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.


➥ ఎడ్యుకేషన్ కోసం టెక్నాలజీ ఉపయోగించడంలో ఎక్కువ నైపుణ్యం కలిగి ఉండాలి.


వయోపరిమితి: 16.01.2024 నాటికి 55 సంవత్సరాలు మించరాదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ, ఫిజికల్ ఇంటర్వ్యూ ఆధారంగా.


రెమ్యునరేషన్: రూ.1,40,000. 


ఆన్‌లైన్ దరఖాస్తును పూరించడానికి అవసరమైన పత్రాలు..


➥ ఈమెయిల్ ఐడీ


➥ పర్సనల్ మరియు ఎడ్యుకేషనల్  క్వాలిఫికేషన్ డీటెయిల్స్(మార్క్‌షీట్‌లు X(10వ), XII(12వ) గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్-గ్రాడ్యుయేషన్ యొక్క ఫైనల్ మార్కుషీట్లు)


➥ ఇటీవలి ఫోటోగ్రాఫ్ యొక్క స్కాన్ చేసిన కాపీ(jpg/jpeg ఆకృతిలో 3 వారాల కంటే పాతది కాదు)


➥ బ్లాక్ ఇంక్ పెన్‌తో సంతకం చేసిన చేసిన స్కాన్ కాపీ (jpg/jpeg ఫార్మాట్‌లో)


➥ ఇమేజ్ సైజ్ కనీసం 20 kb మరియు గరిష్టంగా 50 kb ఉండాలి.


➥ లాస్ట్‌ పేతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. 


➥ ఐడీ ఫ్రూఫ్‌గా పాస్‌పోర్ట్ లేదా ఓటరు ఐడీ ఉండాలి. 


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.01.2024.


➥ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 15.02.2024. (11:00 PM) 


Notification


Website


ALSO READ:


ఏఐఏఎస్‌ఎల్‌లో 130 సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
ఎయిర్ ఇండియా ఎయిర్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్‌) కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 130 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు ఉన్నవారు ఫిభ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు  ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిఉంటుంది. ఉదయం 0900 నుంచి 1200 గంటల వరకు ఇంటర్వూలు నిర్వహిస్తారు. శారీరక దారుఢ్య పరీక్ష, ఆంగ్ల ప్రావీణ్యత పరీక్ష మరియు ఇంటర్వ్యూలు (వ్యక్తిగత లేదా వర్చువల్) ఆధారంగా ఎంపిక ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...